చైతూ, అను , మారుతిల శైలజారెడ్డి అల్లుడు మూవీ ప్రారంభం

First Published 19, Jan 2018, 9:07 PM IST
naga chaitanya anu emmannuel shailaja reddy alludu movie launched
Highlights
  • నాగచైతన్య హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
  • మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు చిత్రం ప్రారంభం
  • ఈ మూవీలో హిరోయిన్ గా అను ఎమాన్యుయెల్

టాలీవుడ్ లో కొత్త సినిమాల హవా మళ్లీ మొదలైంది. రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న మూవీ ఇవాళే మొదలైంది. ఆ సినిమా అలా ప్రారంభమైందో లేదో... దాన్ని ఫాలో అవుతూ మరో సినిమా కూడా మొదలైపోయింది. నాగచైతన్య హీరోగా మారుతి డైరక్షన్లో రూపొందుతున్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ముహూర్తం షాట్ రోల్ అయిపోయింది. గతేడాది రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో  హిట్ సొంతం చేసుకున్న చైతూ యుద్దం శరణం సినిమాతో ఫ్లాప్ చవిచూశాడు. ఇక అజ్ఞాతవాసి సినిమాతో కెరీర్ అతి పెద్ద ఫ్లాపు చేసినట్లుంది అనూ ఎమ్మానుయేల్ పరిస్థితి. ఈ సమయంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మారుతి డైరక్షన్లో ఒక సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు సితార ఎంటర్టయిన్మెంట్ వారు. ఈ సినిమాలో చెయ్ ఒక ఈగో ఉన్న క్యారకెర్టర్ ను చేయబోతున్నాడని టాక్. అయితే అత్త పాత్రలో రమ్యకృష్ణ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుందట.నాగచైతన్య, అను ఎమ్మానుయేల్ కాంబినేషన్ కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తోంది. చూద్దాం ఈ జంట ఎలా ఆకట్టుకుంటుందో. బాబు బంగారం వంటి ఫ్లాప్ తర్వాత మారుతి కూడా ఇప్పుడు ఈ సినిమాతో మాంచి హిట్టు కొట్టలానే కసి మీదున్నాడు. .

loader