నాగబాబు కరోనా వైరస్ మీద, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద చేసే నాగబాబు ఎప్పటికప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటి నుంచి నాగబాబు చేసే ట్వీట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి. కరోనా నుంచి దేవుడు రక్షించడలేడని, దేవుడు, స్వామిజీలు ఏమీ పీకలేరని.. వెళ్లి డాక్టర్లు, సైంటిస్టుల కాళ్లు మొక్కుదాం వారే మనల్ని కాపాడగలరని సంచలన కామెంట్స్ చేశాడు.

తాజాగా కరోనా విజృంభణ నేపథ్యంలో ఒక ప్రొఫెసర్ టీవీలో చెప్పిన ఓ వ్యాఖ్య తనకు బాగా నచ్చిందని జనసేన నేత, సినీనటుడు నాగబాబు అన్నారు. ప్రజలందరికీ బాధ్యతలు కూడా నేర్పించాలని ఆయన ట్వీట్ చేశారు.

https://twitter.com/NagaBabuOffl/status/1243063439070621697

'ప్రైమ్ 9 న్యూస్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది. మనం ప్రజలకి హక్కులు నేర్పాము. బాధ్యతలు నేర్పలేదు అన్నారు. ఇది అక్షర సత్యం. ఈ తప్పు ప్రభుత్వం వారిదే. మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది. నేను కూడా అతీతుడ్ని కాదు. మా ప్రజలందరినీ తన్ని బాధ్యతలు నేర్పించండి. నేర్చుకుంటాం..' అని నాగబాబు చెప్పారు.