Asianet News TeluguAsianet News Telugu

చకోరి సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన 'నా చెలివే' సాంగ్ విడుదల

తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మాయ చేసారు సిద్ శ్రీరామ్. నా చెలివే అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

naa cheli song from chekori released sung by sid sriram
Author
Hyderabad, First Published Sep 13, 2021, 12:00 PM IST

నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ ప్రధాన పాత్రల్లో ఆష్టా సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సత్య ధానేకుల దర్శకత్వంలో దేవు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా చకోరి. ఈ చిత్రం నుంచి తాజాగా నా చెలివే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా.. నోయల్ సీన్, మెహబూబ్ అందులో కనిపించారు. లీండర్ లీ మార్టీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్రన్ ఈ పాటకు సాహిత్యం అందించారు. 

తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మాయ చేసారు సిద్ శ్రీరామ్. నా చెలివే అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్రాంతి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న చకోరి సినిమాకు ప్రశాంత్ నీలం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

నటీనటులు: 
నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ తదితరులు


టెక్నికల్ టీం: 
రచన, దర్శకత్వం: సత్య ధానేకుల 

నిర్మాత: దేవు సత్యనారాయణ

నిర్మాణ సంస్థ: ఆష్టా సినీ క్రియేషన్స్

సంగీతం: లీండర్ లీ

ఎడిటర్: క్రాంతి

సినిమాటోగ్రఫర్: ప్రశాంత్ నీలం

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Follow Us:
Download App:
  • android
  • ios