మెగా మేనల్లుడు సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

 ఇక ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. అందుకునే ఈ చిత్రం నాన్ థియోటర్ రైట్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నా అమ్మలేదని తెలుస్తోంది. అలాగే తమ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని అన్ని ఏరియాలు సొంతగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

 సినిమా కనుక సూపర్ హిట్ అయితే నాన్ థియోటర్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోతాయని నమ్ముతున్నారు.థియోటర్ ఓవర్ ప్లో ..తమని సేఫ్ జోన్ లో పడేస్తుందని వారి ధీమా. అయితే అది పెద్ద రిస్కే అంటోంది ట్రేడ్. ఏమన్నా తేడా కొట్టి అటూ ఇటూ అయితే మొత్తం నష్టపోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ధియోటరో లేక నాన్ థియోటరో ఏదో ఒక రైట్స్ దగ్గర పెట్టుకుని మిగతాది అమ్మితే రిస్క్ తగ్గుతుందని చెప్తున్నారు. అయితే రిస్క్ ఉన్నచోటే కదా లాభాలు ఉండేది. 
 
ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రం టీమ్ ప్రకటించింది. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రిలీజ్ డేట్ మార్చటం ఖాయం.