కమల్ హాసన్ నటించిన `విక్రమ్` సినిమాలో హీరో సూర్య గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోకనాయకుడికి థ్యాంక్స్ చెప్పారు సూర్య.
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)కి థ్యాంక్స్ చెప్పాడు సూర్య(Suriya). ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే తన డ్రీమ్ నెరవేరిందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. `ప్రియమైన కమల్ హాసన్ అన్నా. మీకు ఎలా చెప్పాలి. మీతో స్క్రీన్ పంచుకోవడమనేది నా డ్రీమ్. `విక్రమ్`(Vikram) సినిమాతో అది నెరవేరింది. ఇది జరగడానికి కారణమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి ధన్యవాదాలు. తనపై ఆడియెన్స్ కనబరుస్తున్న ప్రేమకి గర్వంగా ఉంది` అంటూ ట్వీట్ చేశారు సూర్య. తాను నటించిన రోలెక్స్ పాత్రని, విక్రమ్ సినిమాని యాష్ ట్యాగ్ పంచుకున్నారు.
దీనికి కమల్ స్పందించారు. ఇప్పటికే చాలా లేట్ అయ్యిందని,ఇప్పటికే ప్రేమ కలిగి ఉన్నారని, ఇప్పుడా జనాభా పెరిగిందని తెలిపారు. సూర్య భవిష్యత్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ, ఆయన సరదాగా సూర్యని తంబీ సర్ అంటూ సంభోదించడం విశేషం. దీనికి సూర్య రియాక్ట్ అవుతూ నవ్వుతున్న ఎమోజీని పంచుకుంటూ పెద్ద అన్నయ్యా` అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి విలన్‌గా, ఫహద్ ఫాజిల్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం `విక్రమ్`. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తొలి రోజు రూ.32కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంతో కమల్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. మరోసారి ఆయన రెచ్చిపోయారు. ఆయన పాత్ర సెకండాఫ్‌లోనే ఎక్కువగా ఉన్నా, కనిపించిన ప్రతి సీన్‌లో తన విశ్వరూపం చూపించారు. ఎక్స్ ప్రెషన్స్ తోనే ఫిదా చేశారు.
కమల్ హాసన్ కి ధీటుగా నటించారు విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్. ఎవరికి వారు రెచ్చిపోయి వాహ్ అనిపించింది. వీరి హీరోయిజమే సినిమాకి సగం సక్సెస్. ఇక చివర్లో డ్రగ్స్ మాఫియా కింగ్‌గా రోలెక్స్ పాత్రలో సూర్య క్లైమాక్స్ లో మెరిశారు. ఆయన పాత్ర రెండు మూడు నిమిషాలే అయినా విరోచితమైన నటనతో ఆకట్టుకున్నారు. తనలోని అసలైన విలనిజం చూపించారు. రోలెక్స్ పాత్ర సైతం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. మరోవైపు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సినిమాకి మరో హీరో అని చెప్పొచ్చు. బీజీఎం విషయంలో దుమ్మురేపాడు. థియేటర్లో గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉందంటే అతిశయోక్తి కాదు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాని డీల్ చేసిన విధానం అద్భుతం. కథ పరంగా రొటీన్ ఓల్డ్ స్టోరీనే అయినా స్క్రీన్‌ప్లే విషయంలో మ్యాజిక్ చేశాడు. ముగ్గురు దిగ్గజ నటులను డీల్ చేసిన విధానం శెభాష్ అనిపిస్తుంది. ఆ ముగ్గురి పాత్రలకు సమ ప్రాధాన్యతనిస్తూనే, హీరోయిజం, విలనిజం బ్యాలెన్స్ చేశాడు. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లారు.మరోవైపు `ఖైదీ` సినిమా సీన్లని టచ్ చేస్తూ చేయడం మరో హైలైట్. కథ లేకపోయినా, మ్యాజిక్, స్క్రీన్‌ప్లే, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాని సక్సెస్ చేశాయి. ప్రస్తుతం ఈ చిత్రం భారీ కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు.
