త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెంచిన చిత్ర యూనిట్ మొదట 'సామజవరగమన' పాటను విడుదల చేయబోతున్నారు. ఇక సాంగ్ ప్రోమో ఇప్పటికే యూ ట్యూబ్ లో ట్రేండింగ్ గా మారింది. అయితే రీసెంట్ గా సాంగ్ మేకింగ్ పై స్పందించిన సంగీత దర్శకుడు థమన్ పలు విషయాల గురించి వివరణ ఇచ్చాడు.

థమన్ మాట్లాడుతూ.. 'బన్నీకి సాంగ్స్ కంపోజ్ చేయాలంటే చాలా కష్టం. ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. తన డ్యాన్స్ తన ఆలోచన విధానం పర్ఫెమెన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇంతకుముందు రేసుగుర్రం - సరైనోడు చేసినప్పుడు అద్భుతమైన సాంగ్స్ వచ్చాయి.  ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కంపోజ్ చేయడం ప్రతిసారి కొత్తగా అనిపిస్తోంది. సిరివెన్నెల గారు పాటను అద్భుతంగా రాశారు.  

ఇక సాంగ్ న్యాచురల్ గా ఉండేలా ట్రై చేశాము. సిద్ శ్రీరామ్ కూడా పాటను అద్భుతంగా పాడాడు. అర్ధం చేసుకొని గుండెల్లో నుంచి స్వరాలు పలికాడు. ఇక సినిమా కోసం ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కుతోంది' అని చెబుతూ త్వరలోనే సాంగ్స్ ని రిలీజ్ చేయనున్నట్లు థమన్ వివరించాడు. హారికా హాసిని క్రియేషన్ లో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.