Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ ఫిల్మ్ కేసు: లండన్ కంపెనీతో రాజ్ కుంద్రాకు సంబంధాలు.. ఇన్వెస్టిగేషన్ లో సంచలన నిజాలు

రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్, లండన్ కి చెందిన కెన్రిన్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉంది. కెన్రిన్ సంస్థ హాట్ షాట్స్ అనే ఓ ఇల్లీగల్ యాప్ ద్వారా.. పోర్న్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుందని పోలీసులు తెలిపారు.

mumbai discloses interesting details in raj kundra porn content case ksr
Author
Hyderabad, First Published Jul 21, 2021, 8:43 AM IST

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్స్ కేసులో అరెస్ట్ కాబడిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతో రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాగా ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పోర్న్ ఫిల్మ్ కంటెంట్ కి సంబంధించి ఓ లండన్ కంపెనీతో రాజ్ కుంద్రా భాగస్వామిగా ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. 

రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్, లండన్ కి చెందిన కెన్రిన్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉంది. కెన్రిన్ సంస్థ హాట్ షాట్స్ అనే ఓ ఇల్లీగల్ యాప్ ద్వారా.. పోర్న్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుందని పోలీసులు తెలిపారు. కెన్రిన్ సంస్థ లండన్ లో రిజిస్టర్ అయినప్పటికీ.. ఆపరేషన్స్, అకౌంట్స్, కంటెంట్ క్రియేషన్ మొత్తం రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ ద్వారా నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. 


లండన్ కంపెనీ కెన్రిన్ రాజ్ కుంద్రాకు అత్యంత దగ్గరి బంధువుకు చెందినదని పోలీసులు తెలియజేశారు. కెన్రిన్, వియాన్ ఇండస్ట్రీస్ మధ్య గల వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. రాజ్ కుంద్రా ముంబై ఆఫీస్ లో ఈ సంస్థలకు సంబంధించిన పోర్న్ ఫిల్మ్స్, వాట్స్ యాప్ చాట్, ఈమెయిల్స్ బయటపడ్డాయి. బలమైన ఆధారాలు సేకరించిన అనంతరం రాజ్ కుంద్రాను, ఆయన సంస్థ ఐటీ హెడ్ రియాన్ థోర్ప్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios