టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యలకు ఒక్కోక్క టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నారు. దానిలో భాగంగా మోనాల్ గుజ్జర్ తన విలేజ్ గురించి మాట్లాడింది. తన ఊరిలో ఉన్న కుటుంబ సభ్యులను తలుచుకున్న మోనాల్ కన్నీటి పర్యన్తరం అయ్యారు. తమ ఫ్యామిలీలో తండ్రితో పాటు బాబాయ్, పెదనాన్నలు చనిపోయారని. వాళ్లందరికీ ఆడపిల్లలు కాగా ఫ్యామిలీ ఫొటోలో మగవాళ్ళు లేకపోవడం అందరూ ఆడపిల్లలే ఉండడం చాల బాధేసింది  అన్నారు. 

ఆర్థిక స్తోమత లేక ఊరికి కేవలం రెండు సార్లు మాత్రమే నాన్న బ్రతికి ఉండగా తీసుకెళ్లారు అన్నారు. తన కుటుంబాన్ని తలచుకొని కన్నీళ్లు పెట్టడంతో ఇంటి సభ్యులు ఆమెను ఓదార్చారు. ఐతే గంగవ్వ మాత్రం ఆమెతో పాటు ఏడ్చేశారు. కరాటే కళ్యాణి, గంగవ్వను ఏడవద్దని చెప్పారు. 

ఐతే మోనాల్ ని తమ విలేజ్ గురించి ఆనందకరమైన విషయం పంచుకోవాలని ఇంటి సభ్యలు కోరడంతో, ఆ విలేజ్ లో కుటుంబ సభ్యులను అందరినీ కలవడం బాగా నచ్చిన విషయం అని చెప్పారు. మోనాల్ మాత్రం తన ఎమోషనల్ స్టోరీతో గంగవ్వను ఏడిపించేసింది.