`దృశ్యం` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సంచలనం సృష్టించింది. అంతేకాదు ఇది ఏకంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి చాలా ఇండియన్‌ లాంగ్వేజ్‌లోనూ రీమేక్‌ అయ్యింది. చైనీస్‌ భాషలోకి కూడా రీమేక్‌ అయ్యింది. రీమేక్‌ అయిన ప్రతి భాషలోనూ విజయం సాధించింది. 

తాజాగా దీనికి సీక్వెల్‌ చేసేందుకు ముందుకొచ్చారు మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌. సీక్వెల్‌ని సోమవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని మోహన్‌లాల్‌ తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా పూజా కార్యక్రమ ఫోటోలను పంచుకున్నారు. అయితే చాలా వరకు సీక్వెల్‌ సినిమాలు పరాజయమే చెందాయి. మరి ఈ సినిమా హిట్‌ అయితే ఆ మ్యాజిక్‌ని రిపీట్‌ చేస్తుందా? అన్నది చూడాలి. 

మోహన్‌లాల్‌ సీక్వెల్‌ స్టార్ట్ చేయడంతో ఇటు తెలుగులో వెంకీ, అటు తమిళంలో కమల్‌ హాసన్‌, హిందీలో అజయ్‌ దేవగన్‌ ఈ సినిమాపై ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలై ఫలితం వచ్చాక వీరు కూడా సీక్వెల్‌ ప్రారంభిస్తారా? లేక ఈ లోపే మరో కథతో రంగంలోకి దిగతారా? అన్నది చూడాలి. తెలుగులో ఈ సినిమాని వెంకటేష్‌ హీరోగా, మీనా హీరోయిన్‌గా శ్రీప్రియ దర్శకత్వం వహించారు. తెలుగులోనూ సూపర్‌ హిట్‌ సాధించి పరాజయాల్లో వెంకీకి ఊరటనిచ్చింది.