Manchu Lakshmi:అయ్యో.. మంచు లక్ష్మిని ఎత్తి నీళ్లలో పడేసారు (వీడియో)
కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి. ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూంటారు మంచు లక్ష్మి .మంచు మోహన్ బాబు నట వారసురాలుగా మంచు లక్ష్మీ.. పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి. ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది.
ఆ క్రమంలో ఆమె తాజాగా ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మంచు విష్ణు తన కుటుంబ సభ్యులను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేస్తుంటే వీడియో తీస్తూ ఎంజాయ్ చేసింది లక్ష్మి. ఇంతలో విష్ణు అందరి వంతు అయిపోంది కానీ ఇంకా ఒక్కరు బ్యాలెన్స్ ఉన్నారనుకున్నాడు.
వెంటనే లక్ష్మి దగ్గరకు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు నడిచాడు. దీంతో విషయం అర్థమైన లక్ష్మి వద్దంటూ కేకలు పెట్టింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ మోహన్‌బాబు సైతం విష్ణుకి సాయం చేస్తూ ఆమెను నీళ్లలో పడేశారు. తండ్రి కూడా తనకు సాయం చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేసి పూల్‌లో ఎత్తేసినందుకు ఆమె కాస్త కోపంతో అరిచింది కూడా! అంతా నా కర్మ అంటూ సదరు వీడియోను పంచుకుంది.
మంచు లక్ష్మి, తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నుండి అడపాదడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు. అయితే లక్ష్మి ఇటూ సినిమాలు చేస్తూనే అటూ టీవీ స్క్రీన్ మీద ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగువారిని అలరిస్తోంది.
తెలుగు తెరకు పరిచయం కాక ముందు లక్ష్మి, 'లాస్ వెగాస్', 'డెసపరేట్ హౌజ్ వైవ్స్' లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో నటించింది. మంచు లక్ష్మి టాక్ షో కూడా చేసారు. ఇపుడు వెబ్ సిరీస్‌లో నటిస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా సినిమాల కంటే కూడా స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది మంచు వారసురాలు. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు. గతేడాది కూడా ఓ బోల్డ్ షోను హోస్ట్ చేసింది మంచు లక్ష్మి.