మెహ్రీన్ ను ప్రశ్నించిన అమెరికా పోలీసులు!

Mehreen Kaur questioned by US authorities
Highlights

అమెరికాలో మెహ్రీన్ కు చేదు అనుభవం

'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. త్వరలోనే 'పంతం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ పంజాబీ ముద్దుగుమ్మకు అమెరికాలో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికాలో టాలీవుడ్ తారల సెక్స్ రాకెట్ బయటకు పొక్కిన సంగతి తెలిసిందే. 

ఈ విషయంలో పోలీసులు చికాగోకు చెందిన భారతీయ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆరుగురు టాలీవుడ్ హీరోయిన్లను ఈ కేసులో విచారించినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ కారణంగా ఇప్పుడు అమెరికాకు షూటింగ్ కోసం వచ్చే హీరోయిన్లను సైతం పోలీసులు విచారించడం కొందరికి బాధ కలిగిస్తోంది. నటి మెహ్రీన్ కూడా పంతం సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లింది. షెడ్యూల్ పూర్తవడంతో అక్కడ నుండి కెనడా వెళ్లాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో ఇమిగ్రేషన్ లో ఆమె సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అరగంటకు పైగా అధికారులు ఆమె ప్రశ్నించారట. కెనడాకు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో సరైన కారణాలు చెప్పిన తరువాతే ఆమెను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో మెహ్రీన్ అసహనానికి లోనైందని చెబుతున్నారు. అవమానంగా భావించిన ఆమె తన సన్నిహితుల వద్ద బాధ పడినట్లు సమాచారం. నిజానికి ఈ సెక్స్ రాకెట్ సంగతి మెహ్రీన్ కు తెలియలేదంట. దీంతో అధికారులు తనతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియక చాలా ఇబ్బంది పడిందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 
 

loader