అమెరికా సెక్స్ రాకెట్: అక్కడ జరిగిన అసలు విషయమిది

Mehreen Kaur Gives Clarity on About USA Officials Enquiry on Sex scandal
Highlights

అమెరికాలో తెలుగు తారలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తోన్న కిషన్ అతడి భార్య చంద్రకలను పోలీసులు అదపులో తీసుకున్న సంగతి తెలిసిందే

అమెరికాలో తెలుగు తారలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తోన్న కిషన్ అతడి భార్య చంద్రకలను పోలీసులు అదపులో తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు వచ్చే తెలుగు నటీమణులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మెహ్రీన్ ను కూడా క్వశ్చన్ చేశారు. తన తల్లితండ్రులతో అమెరికా వెళ్లింది మెహ్రీన్. కెనడాలోని వాంకోవర్ నుండి లాస్ వేగాస్ కు ట్రిప్ ప్లాన్ చేసుకుంది. అయితే అమెరికా బోర్డర్ సెక్యురిటీ అధికారులు మెహ్రీన్ కుటుంబాన్ని అరగంటసేపు విచారించినట్లు ఓ ఇంగ్లీష్ పేపర్ లో వార్త వచ్చింది. అంతేకాదు మెహ్రీన్ తమకు ఇంటర్వ్యూ ఇచ్చిందని సదరు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన మెహ్రీన్ తను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని తేల్చి చెప్పింది. అసలు అమెరికా ఏం జరిగిందో తనే స్వయంగా చెప్పుకొచ్చింది. 

''అమెరికాలో నేను నా కుటుంబంతో కలిసి వాంకోవర్ నుండి లాస్ వేగాస్ కు వీకండ్ హాలిడే కోసం వెళ్లాను. నేను ఇమిగ్రేషన్ అధికారుల వద్దకు వెళ్లినప్పుడు వారు నన్ను తెలుగునటిగా గుర్తించారు. అప్పుడు వారు నేను అమెరికాలో ప్రయాణించడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అప్పుడే నాకు సెక్స్ స్కాండల్ గురించి తెలిసింది. ఆ ఇష్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదని వారికి అర్ధమైన తరువాత నాకు క్షమాపణ చెప్పి నా జర్నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. వేరే ఎవరో దీని గురించి చెప్పడం కంటె నేనే చెప్పడం మంచిదని స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను అక్కడ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాను నిజమే కానీ అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. కొందరు చేసిన తప్పుడు పనుల కారణంగా మొత్తం ఇండస్ట్రీకు చెడ్డ పేరు వస్తుండడం బాధాకర విషయం. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పక పడుతుంది. ఈ విషయం గురించి నేను మాట్లాడడం ఇదే చివరిసారి. దయచేసి నన్ను సంప్రదించకుండా ఎలాంటి వార్తలు ప్రచురించకండి'' అంటూ మీడియాకు రిక్వెస్ట్ చేసింది. 

loader