సైరా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయంలో ఇది మెగా అంభిమానులకు మరో శుభవార్త. ఈ నెల 6న చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో పర్యటించనున్నారు. ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం చిరంజీవి తాడేపల్లి గూడెం వెళ్లనున్నారు. 

లెజెండ్రీ నటుడు యస్వీ రంగారావు విగ్రహాన్ని తాడేపల్లి గూడెంలో ఆవిష్కరించేందుకు చిరంజీవి వెళ్లనున్నారు. తాడేపల్లి గూడెంలో 6వ తేదీ ఉదయం 10:15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, యస్వీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. 

వాస్తవానికి కొన్ని వారాల ముందే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయంలో చిరంజీవి సైరా చిత్ర పనులతో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఎట్టకేలకు చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 

యస్వీఆర్ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి లాంటి నటులకు ధీటుగా నటించారు. హిరణ్యకశ్యప, ఘటోత్కచుడు లాంటి పౌరాణిక పాత్రలకు ఆయన పెట్టింది పేరు.