స్టార్ డమ్ లో ఫాలోయింగ్ లో యంగ్ స్టార్స్ కి గట్టిపోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన చిరు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. గత ఏడాది సైరా అనే భారీ పాన్ ఇండియా మూవీ చేసిన మెగాస్టార్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నారు. చిరు బర్త్ డే కానుకగా విడుదలైన మోషన్ పోస్టర్ విశేష ఆదరణ దక్కించుకుంది. సోషల్ కాన్సెప్ట్ కి కమర్షియల్ అంశాలు జోడించి చిరు ఇమేజ్ కి తగ్గట్టుగా కొరటాల శివ ఈ చిత్రం చేస్తున్నారని సమాచారం. 

కాగా మెగాస్టార్ ఫాలోయింగ్ లో కూడా తనకు సరిలేరని నిరూపించుకుంటున్నాడు. కొద్దినెలల క్రితం చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు.  సోషల్ మీడియా సాధనాలైన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ఆయన తెరిచారు. ఇక తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలు, సామాజిక, రాజకీయ విషయాలపై చిరంజీవి స్పందిస్తున్నారు. కాగా ఇంస్టాగ్రామ్ లో చిరంజీవి ఫాలోవర్స్ సంఖ్య వన్ మిలియన్ కి చేరింది. మార్చిలో చిరంజీవి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగా తక్కువ వ్యవధిలో ఆయన వన్ మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకున్నారు. 

ఇక ట్విట్టర్ లో కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య 7.3 లక్షల వరకూ ఉంది. కాగా ఆచార్య షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తి కాగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఆచార్యతో పాటు చిరంజేవి మరో రెండు చిత్రాలు లైన్ లో పెట్టారు. సాహో ఫేమ్ సుజీత్ దర్శకుడిగా మలయాళ హిట్ మూవీ లూసిఫర్ లో చిరంజీవి నటించనున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయి. దర్శకుడు మెహర్ రమేష్ తో చిరంజీవి మరొక చిత్రం చేయనున్నారు. ఇది తమిళ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ అని ప్రచారం జరుగుతుంది.