ఇండస్ట్రీ బాగు  కోసం ఇప్పటికే చాలా మంచి పనులు చేశారు స్టార్ సీనియర్ హీరో చిరంజీవి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలోని పేదవారికోసం మరో భారీ సాయానికి పూనుకున్నారు.  

టాలీవుడ్ ఇండస్ట్రీకి కష్టం వచ్చిందటే అది తీర్చడానికి ముందు ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఏ ఆపద వచ్చిన సాహాయం చేయడానికి ఒక అడుగు ముందుగా ముందుకు వేస్తాడు. పెద్దన్నలా ఇండస్ట్రీకి ఎంత చేసినా.. తానే టాలీవుడ్ కు పెద్ద అని మాత్రం అనిపించుకోవడానికి ఇష్టపడటంలేదు. కాని కార్మికుల బాగుకోసం ఎప్పటికప్పుడు సాయం చేస్తూనే ఉన్నాడు. ఏదైనా ఆపద ఎదురైతే.. తోడబుట్టిన అన్నయ్యలా ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు.. ఇలా గతంలో ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి సాయం అందించిన మెగాస్టార్ ఇండస్ట్రీ పెద్దగా.. కరోనాతో విలవిల్లాడుతున్న సినీ కార్మికులను కూడా ప్రతేకంగా ఏర్పాటు చేసిన రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకున్నారు. 

ఇక ఇప్పుడు మరోసారి సినీ కార్మికుల కోసం పెద్ద వరం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ కోసం కీలక ప్రకటన చేశారు. తన తండ్రి పేరు మీద ఆసుపత్రిని నిర్మించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తానని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తానని అన్నారు. చిత్రపురి కాలనీలో పేద కార్మికులు భరించలేని హాస్పిటల ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారని. వారి కోసమే మంచి హాస్పిటల్ ను నిర్మించాలని సంకల్పించారు మెగాస్టార్. 

Scroll to load tweet…

అంతే కాదు ఇదేదో ప్రచారం కోసం చేయడంలేదని.. తాను చేసే పనులకు పెద్దగా ప్రచారం అవసరం లేదని అయితే... దీనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం కచ్చితంగా ఇస్తానన్నారు. ఇలా పది మందికి ఈ విషయం తెలిస్తే, వాళ్లు కూడా ఈ విషయంలో స్ఫూర్తి పొందుతారని, వాళ్లు కూడా మంచి పనులు చేస్తారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తన పుట్టిన రోజు అయిన అగస్ట్ 22న హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపణ చేయబోతున్నారు మెగాస్టార్. 

టాలీవుడ్ సినిమా క్రికెటర్లు అంతా సెప్టెంర్ 24 నుంచి అమెరికాలోని డల్లాస్ లో క్రికెట్ టోర్నీ ఆడనున్నారు. దీనికి సంబంధించిన లోగోను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, డల్లాస్ ట్రోఫీ ద్వారా వచ్చే కొంత మొత్తాన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇస్తామని చెప్పారు. యంగ్ హీరో తరుణ్ కూడా 20 లక్షల వరకూ తమ టీమ్ నుంచి ఇస్తామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ... తన వంతుగా మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించి ఆసుపత్రి నిర్మాణం కోసం ఆ డబ్బును ఇస్తానని తెలిపారు. ఇలా చాలా మంది మెగాస్టార్ ఆశయానికి తోడ్పాటు అందించడానికి ముందుకు వచ్చారు. 

ఇక‌ చిరంజీవి ఈ ఏడాది వరుస సినిమాలతో రాబోతున్నారు. భారీ అంచాల‌తో రిలీజ్ అయిన ఆచార్య దెబ్బకొట్టడంతో చిరు బాగా డిస్పాపాయింట్ అయ్యారు. మెగా ఫ్యాన్స్‌ కూడా తీవ్రంగా నిరాశ‌చెందారు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్‌ఫాద‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది..ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజ‌ర్ ఆగ‌స్టు 21 రిలీజ్ కానుంది. దీనితో పాటుగా చిరు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేరు వీర‌య్య‌, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు వెంకీ కుడుములాతో కూడా ఓ మూవీ కమిట్ అయ్యారు మెగాస్టార్.