మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. దేవాలయాలు, విప్లవ భావజాలం అంశాలతో కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. దేవాలయాలు, విప్లవ భావజాలం అంశాలతో కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

దీనితో ప్రచార కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ తో ఆచార్య అసలైన సందడి షురూ కాబోతోంది. ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆచార్య ట్రైలర్ ని ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. దీనికోసం చిరంజీవి ఎర్ర కండువాతో, రాంచరణ్ తుపాకీతో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. 

రాంచరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ కామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి జోడిగా ఈ చిత్రం కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ.. చిరంజీవిని ఈ చిత్రంలో ఎంత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసారో అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటికే కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఆచార్య.. ఈ సారి మాత్రం పక్కాగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. దేవాలయాల వెనుక జరుగుతున్న అవినీతిని ఈ చిత్రం వెలికితీసే విధంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో కొరటాల శివ పొలిటికల్ అంశాలని కూడా ఇన్వాల్వ్ చేశారట. కొరటాల చిత్రాల్లో కమర్షియల్ అంశాలు ఉంటాయి. కానీ ప్రధానంగా సందేశం హైలైట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నటుడు కొరటాల దర్శకత్వంలో నటిస్తే వెండి తెరపై మ్యాజిక్ ఖాయం అని అంటున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Scroll to load tweet…