విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హీరో నాని నటించనున్న సినిమాకి టైటిల్ గా 'గ్యాంగ్ లీడర్' అనే పేరుని ఫిక్స్ చేశారు. నాని ఎప్పుడైతే ఈ టైటిల్ అనౌన్స్ చేశాడో.. మెగాఫ్యాన్స్ అతడిని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం మొదలుపెట్టారు.

ఎంత అహంకారం ఉంటే మెగాస్టార్ క్లాసిక్ టైటిల్ ని టచ్ చేస్తారంటూ నానిని నిలదీస్తున్నారు. మెగాహీరోలే వాడడానికి భయపడే టైటిల్ ని అంత ఈజీగా నాని ఎలా పెట్టుకుంటాడంటూ మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో నాని సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. నిజానికి ఈ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా తీస్తే బాగుంటుందని మెగాఫ్యాన్స్ ఆశించారు. ఒకానొక దశలో 'వినయ విధేయ రామ' సినిమాకి 'గ్యాంగ్ లీడర్' టైటిల్ పెట్టాలనుకున్నారు.  కానీ రామ్ చరణ్ నో చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. 

నిజానికి ఆ టైటిల్ ని టచ్ చేయడానికి మెగాహీరోలు కాస్త ప్రెషర్ ఫీల్ అయ్యారు. ఆ కారణంగానే దాని జోలికి వెళ్లలేదు. ఇప్పుడు బయట హీరో టైటిల్ వాడుకోవడంతో మెగాఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. నానిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. ఈ రియాక్షన్ ఊహించని నాని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!