కరోనా దేశంలో విజృంభిస్తోంది. ఒక్క రోజులోనే దాదాపు లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకి చిత్ర పరిశ్రమలు కూదేలవుతున్నాయి. ఇక సినీ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పేరుమోసిన ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. 

తాజాగా మెగా ఫ్యామిలీని కరోనా అంటుకున్నట్టు తెలుస్తుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కరోనాకి గురైనట్టు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా, అనుమానంతో టెస్ల్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని సమాచారం. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారట.

నాగబాబు పలు టీవీ ఛానెల్స్ లో సీరియల్స్, అలాగే టీవీ షో చేస్తున్నారు. ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వైరస్‌ సోకినట్టు తెలుస్తుంది. నాగబాబుకి కరోనా అనే వార్త తెలిసి షో టీమ్‌లోని
మెంబర్స్, ఇతర సిబ్బంది ఉలిక్కిపడ్డారట. తమకి కూడా సోకిందేమో అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగబాబు హోం అసోలేషన్‌లో ఉన్నట్టు టాక్‌. ఇదిలా ఉంటే ఈ సాయంత్రం నాగబాబు మనీ సంపాదించడం ఎలా అనే వీడియోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం విశేషం. మరి నిజంగానే ఆయనకు వైరస్‌ సోకిందా? లేక ఇది గాలి వార్తనా? అన్నది ఆయన స్పందిస్తే గానీ తెలియదు.