చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా మారిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించటంతో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.  ముఖ్యంగా ‘ఏ’ క్లాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘మత్తు వదలరా’  సినిమా బడ్జెట్ కేవలం రూ.2.1 కోట్లే కావటం కూడా కలిసి వచ్చింది.  ఈ బడ్జెట్ లో రెమ్యునేషన్స్ ని మినహాయిస్తే.. మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు రూ.1.3 కోట్లు మాత్రమే. ఇక ఈ చిత్రం పెద్ద తెర మీదే కాకుండా బుల్లి తెరమీద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
 
టీవీలో  ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 4.05 (అర్బన్) రేటింగ్ రావడం విశేషం. ఆ రేటింగ్  కూడా నాన్-ప్రైమ్ టైమ్ లో కావటం ఇంకో చెప్పుకోదగ్గ విషయం. ఈ సినిమాను స్టార్ మా ఛానెల్ ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారం చేసింది. రెగ్యులర్ గా  సినిమాలకు మంచి రేటింగ్స్ రావాలంటే శనివారం సాయంత్రం లేదా ఆదివారం సాయంత్రం టెలీకాస్ట్ చేస్తుంటారు. కానీ మధ్యాహ్నం టైమ్ లో టెలికాస్ట్ అయి కూడా మంచి టీఆర్పీ సాధించింది ఈ సినిమా. అందుకు కారణం చాలా మంది ఈ చిన్న సినిమాని థియోటర్ లో చూద్దామనుకున్నారు కానీ ..కుదరలేదు. దాంతో టీవిల్లోరాగానే జనం ఎగబడి చూసారు. అదే టీవికు కూడా కలిసొచ్చింది. దాంతో స్టామా చాలా హ్యాపీగా ఉంది.

ఇక సక్సెస్ కావటానికి, తక్కువ బడ్జెట్ లో అవటానికి కారణం .. తన డైరెక్షన్ టీం మొత్తాన్ని రితేష్ తీసుకున్న శ్రద్దే అంటున్నారు నిర్మాత. కేవలం 42 రోజుల్లోనే సినిమాను ముగించామని మైత్రీ సంస్థ వెల్లడించింది.  రితేష్ రాణా ‘మత్తు వదల’రాకు దర్శకత్వం వహించాడు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ హీరోగా.. పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. జీవా, విద్యుల్లేఖ రామన్, సత్య, నగరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.