కథే హీరో అంటూ చిన్న చిత్రాలను ఎంకరేజ్‌ చేసిన దాసరి తెలుగులో అందరి టాప్‌ స్టార్స్‌ని డైరెక్ట్‌ చేశారు.దాసరి మొదట రచయితగా పనిచేసి దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. తర్వాతి కాలంలో ఆయన నిర్మాతగా మారారు.

మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్నా వ్యక్తి దర్శకరత్న డా. దాసరి నారాయణరావు. 2017 మే 30న ఆయన భౌతికంగా దూరమయ్యారు. సినీ కార్మికుల పక్షాన నిలిచిన ఆయన వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారు. తెలుగు ఇండస్ట్రీకి పెద్దదిక్కు గా నిలిచిన ఆయన వల్ల ఎంతో మంది ఇప్పుడు స్టార్స్ అయ్యారు. ఆయన శిష్యుల్లో చాలామంది ఇప్పుడు టాప్ పొజీష‌న్‌లో ఉండగా, ఆయనను చూసి ఇండస్ట్రీకి వచ్చిన వారు కూడా ఎందరో ఉన్నారు. 

ఈ క్రమంలో ఆయన బయోపిక్ తీస్తే భావి తరాలకు ప్రేరణగా ఉంటుందని చాలా భావించారు. కానీ ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ ఆ కలను నిజం చేయటానికి దర్శకుడు మారుతి ముందుకు వచ్చారు. బయోపిక్ గురించి.. ఓ క్లారిటీ వచ్చిందట. దాసరి క్యారెక్టర్ ఎవరితో చేయించాలి. కథ ఎలా ఉండాలి.? అనేది క్లారిటీ వచ్చిందట. 

మారుతి మాట్లాడుతూ.. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఆయ‌న బ‌యోపిక్ నేనే తీస్తా. ఇప్పుడు కాక‌పోయినా ఎప్పుడైనా స‌రే, బ‌యోపిక్ తెర‌పైకి తీసుకెళ్తా. అందుకు పెద్దాయన దాసరి ఆశీర్వాదాలు కావాలంటూ డైరెక్టర్ మారుతి అన్నారు. కొంతకాలంగా మారుతి దాస‌రి బ‌యోపిక్ పై సమాలోచన చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే స్క్రిప్టు వర్క్ ప్రారంభిస్తారట. రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు తెరపైకి రావటానికి పట్టచ్చు అన్నారు. 

ఇక దాసరి ప్రేరణతో ఇండస్ట్రీకి వచ్చిన మారుతి పూర్తి పేరు దాసరి మారుతి. అయితే స్ర్కీన్ మీద ఎప్పుడూ దాసరి మారుతి అని పేరు వేసుకోలేదు. కారణం ఏంటని అడిగితే... దాసరి అంటే ఆయనే. ఒక్కరే ఉంటారు. మరో దాసరి లేరు రారు అని.. ఆయన పై ఉన్న అభిమానంతోనే దాసరి మారుతి అని వేసుకోలేదు అన్నారు.