Trisha: త్రిషపై వల్గర్ కామెంట్స్... అది కాంప్లిమెంట్ అన్న నటుడు మన్సూర్ అలీ ఖాన్!
త్రిషను ఉద్దేశిస్తూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ సౌత్ ఇండియా వైడ్ సంచలనంగా మారాయి. మన్సూర్ అలీ ఖాన్ త్రిషతో రేప్ సీన్ సన్నివేశం ఉంటుందని ఆశపడ్డాను అని అర్థం వచ్చేలా మాట్లాడాడు. సర్వత్రా విమర్శల నేపథ్యంలో వివరణ ఇచ్చాడు.

లియో మూవీలో కీలక రోల్ చేసిన మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లియో మూవీలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను ఆమెను బెడ్ రూమ్ కి తీసుకువెళ్లాలి అనుకున్నాను. త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశం ఉంటుంది అనుకున్నాను. గతంలో చాలా మంది హీరోయిన్స్ తో నేను రేప్ సన్నివేశాలు చేశాను. లియో కాశ్మీర్ సెట్స్ లో త్రిషను అసలు నాకు చూపించనేలేదు, అన్నాడు. దీనిపై త్రిష ఫైర్ అయ్యారు.
ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉంది. ఇకపై జీవితంలో అతడితో నటించను. మానవజాతికి మన్సూర్ అలీ ఖాన్ అవమానం... అని ట్వీట్ చేశారు. మన్సూర్ అలీ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. కుష్బూ, చిన్మయి శ్రీపాద, మంత్రి రోజా, దర్శకుడు లోకేష్ కనకరాజ్ తప్పుబట్టారు. సర్వత్రా విమర్శల నేపథ్యంలో మన్సూర్ అలీ ఖాన్ వివరణ ఇచ్చాడు.
త్రిషని బెడ్ రూమ్ కి ఎత్తుకెళ్ళి అంటూ లియో నటుడు వల్గర్ కామెంట్స్.. తీవ్రంగా ఖండించిన లోకేష్ కనకరాజ్
నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎడిట్ చేసి కొన్ని మాటలు తొలగించారు. లియో మూవీలో ఆమె పాత్ర కీలకం. పర్వతాన్ని ఎత్తిన హనుమంతుడితో ఆమెను పోల్చాను. త్రిషకు నేను ఇచ్చిన కాంప్లిమెంట్స్ చూపించలేదు అన్నాడు. అలాగే సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ సందేశం రాసుకొచ్చాడు.
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. నా కెరీర్ ని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. నేను గతంలో చాలా మంది హీరోయిన్స్ తో కలిసి పనిచేశాను. ఎవరితో అసభ్యంగా ప్రవర్తించలేదు... అని ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. మన్సూర్ అలీ ఖాన్ వివరణపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.