అల్లు అర్జున్ కోసం రంగంలోకి మనోజ్ బాజ్ పాయ్, పవర్ ఫుల్ పాత్రలో ఫ్యామిలీ మెన్ స్టార్
పుష్ప2 కోసం పక్కాగా ప్రిపేర్ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈసారి అంతకు మించి ఏండేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే కాస్ట్ ను కూడా సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇక బన్నీ కోసం మరో సారి ఫ్యామిలీ మెన్ స్టార్ ను రంగంలోకి దించబోతున్నాడట డైరెక్టర్.
పుష్ప2 కోసం పక్కాగా ప్రిపేర్ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈసారి అంతకు మించి ఏండేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే కాస్ట్ ను కూడా సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇక బన్నీ కోసం మరో సారి ఫ్యామిలీ మెన్ స్టార్ ను రంగంలోకి దించబోతున్నాడట డైరెక్టర్.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చి సంచలనం సాధించింది పుష్ప సినిమా. పుష్ప సంచలన విజయంతో అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాను ఆకర్షించాడు. ఈ సినిమా హిందీ వెర్షన్లో కూడా 100 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక పుష్పకు వచ్చిన రెస్సాన్స్ తో పుష్ప2పై బాధ్యతను మరింత పెంచింది. దాంతో పుష్ప 2 సినిమా కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మేకర్స్.
ముఖ్యంగ ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా కలిసి వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా..పుష్పలో చేసిన తప్పులు పుష్ప2 లో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట టీమ్. అందులో భాగంగానే కొంత మంది ఆర్టిస్టు లను తీసుకోవాలి అనకుంటున్నారట. ముఖ్యంగా బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకుని.. అక్కడ వచ్చిన రెస్పాన్స్ రిత్యా.. బాలీవుడ్ నుంచి ఎక్కువమంది ఆర్టిస్టులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ప్యామిలీ మెన్ వెబ్ సిరీస్ హీరో.. బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్ పాయ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్రను సుకుమార్ డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ - మనోజ్ బాజ్ పాయ్ కలిసి పనిచేశారు. హ్యాపీ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇక హ్యాపీ సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రనే పోషించాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక మళ్లీ ఇంత కాలానికి బన్నీ సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ చేయడం .. అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడం... ఈ సినిమా అంచనాలు పెంచబోతోంది. ఇక అగస్ట్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.