Asianet News TeluguAsianet News Telugu

'మన్మథుడు 2'లో బూతులు.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు!

'మన్మథుడు 2' సినిమాలో బూతుల ప్రస్తావన నాగ్ వద్ద తీసుకురాగా.. 'అవును.. ఈ సినిమాలో 'ఎఫ్' వర్డ్స్ ఉన్నాయి' అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అంతేకాదు.. పోర్చుగల్ లో తీసిన సినిమా ఆ మాత్రం ఉండకపోతే ఎలా అన్నట్లు మాట్లాడారు. 

manmadhudu-2 targetting youth audience
Author
Hyderabad, First Published Aug 8, 2019, 2:46 PM IST

అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు' సినిమా అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దాన్ని చిత్రీకరించారు. ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమా వస్తే ఛానల్ మార్చకుండా చూసేస్తుంటారు. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ని వాడుకుంటూ 'మన్మథుడు 2' సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా టైటిలే పెట్టుకోవడంతో ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని భావిస్తారు కానీ ఈ సినిమా హద్దులు దాటినట్లు కనిపిస్తోంది.

ఈ సినిమా యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. కొన్ని డైలాగ్స్ పై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. మ్యూట్ లు బాగానే పడ్డాయి. రకుల్ పొగ తాగడం, కొన్ని ముద్దు సీన్లు.. ఇలా యూత్ ని ఎట్రాక్ట్ చేసే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమాని  రూపొందించే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమైనా పరవాలేదని తీశారమో అనిపిస్తోంది.

సినిమాలో బూతుల ప్రస్తావన నాగ్ వద్ద తీసుకురాగా.. 'అవును.. ఈ సినిమాలో 'ఎఫ్' వర్డ్స్ ఉన్నాయి' అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అంతేకాదు.. పోర్చుగల్ లో తీసిన సినిమా ఆ మాత్రం ఉండకపోతే ఎలా అన్నట్లు మాట్లాడారు. సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కోలా ప్రవర్తిస్తుందని.. కొన్ని సార్లు అలా మాట్లాడాల్సి వస్తుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అలా చూసుకుంటే 'మన్మథుడు'  సినిమాలో కూడా ఫారెన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అప్పుడు మాత్రం ఎలాంటి బూతులు లేకుండా సినిమా తీశారు. ఇప్పుడు స్పెషల్ గా సినిమాలో బూతులు  చేయడానికి కారణం జనాల మైండ్ సెట్స్ మారాయి.. బూతులనేవి కామన్ అయిపోయాయి. నాగార్జున కూడా ఈ విషయంలో రాజీ పడి కుర్రాళ్లకు నచ్చేలా సినిమా తీసినట్లున్నారు. అలా చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వడం కష్టమే!
 

Follow Us:
Download App:
  • android
  • ios