డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మునుపటి పూరి జగన్నాధ్ ని చూస్తున్నామని అభిమానుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ వసూళ్ళని కొల్లగొట్టింది. 

ప్రస్తుతం పూరి జగన్నాధ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ తెరక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన స్వర బ్రహ్మ మణిశర్మ జోరు ఇటీవల బాగా తగ్గింది. 

విజయ్ దేవరకొండ మూవీ.. పూరి ఆ హీరోయిన్ ని వదిలేలా లేడుగా!

స్టార్ హీరోలు మణిశర్మని పక్కన పెట్టేశారు. ఇదిలా ఉండగా ఇస్మార్ట్ శంకర్ మూవీకి మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ చిత్ర విజయంలో మణిశర్మ సంగీతం కీలక పాత్ర పోషించింది. దీనితో పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ చిత్రానికి కూడా మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు. 

తాజా సమాచారం మేరకు పూరి జగన్నాధ్, మణిశర్మ మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇమేజ్ కు తగ్గట్లుగా మణిశర్మ నుంచి అదిరిపోయే ఆల్బమ్ రాబట్టాలని పూరి ప్రయత్నిస్తున్నాడు.