Asianet News TeluguAsianet News Telugu

మ‌ణిర‌త్నం ‘నవరస’ లో తెలుగు స్టార్స్ ఎవరు?

పేరుకు త‌గ్గ‌ట్టే తొమ్మిది ఎపిసోడ్ల‌తో సాగే వెబ్ సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్‌కీ ఒక్కో ద‌ర్శ‌కుడు. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో హీరో. మ‌ణిర‌త్నం స్వ‌యంగా ఓ ఎపిసోడ్ కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. మిగిలిన ఎనిమిదీ ఎనిమిదిమంది ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గిస్తారు. మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ మీనన్, కార్తీక్‌ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం.

Mani Ratnams anthology  Navarasa
Author
Hyderabad, First Published Jul 15, 2020, 11:54 AM IST

ప్లాట్‌ఫామ్‌ ఏదైనా కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్స్, స్టార్ డైరక్టర్స్ కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా సిరీస్‌లు చేయడానికి సినిమా స్టార్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్‌ సమాచారం. ‘నవరస’ (నవరసాలు) అనే థీమ్‌తో సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో డైరెక్టర్‌ డైరెక్ట్‌ చేస్తారు. 

పేరుకు త‌గ్గ‌ట్టే తొమ్మిది ఎపిసోడ్ల‌తో సాగే వెబ్ సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్‌కీ ఒక్కో ద‌ర్శ‌కుడు. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో హీరో. మ‌ణిర‌త్నం స్వ‌యంగా ఓ ఎపిసోడ్ కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. మిగిలిన ఎనిమిదీ ఎనిమిదిమంది ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గిస్తారు. మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ మీనన్, కార్తీక్‌ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం.
 
అలాగే ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో హీరో క‌నిపిస్తారు. ఇప్ప‌టికే మాధ‌వ‌న్‌, సూర్య‌, సిద్దార్థ్‌ల ను త‌న హీరోలుగా ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రో ఆరుగురు హీరోలు, ఎనిమిదిమంది ద‌ర్శ‌కులు కావాలి. వాళ్ల వివ‌రాల్ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. తెలుగు నుంచి కూడా కొంత‌మంది ద‌ర్శ‌కులు, హీరోల్ని ఎంచుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ తెలుగు హీరోలు నాగచైతన్య, నాని కావచ్చు అంటున్నారు. మరి దర్శకులు విషయం మాత్రం తెలియరాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios