ఈ మధ్య స్టార్స్ మధ్య ఛాలెంజ్ లు ఎక్కువై పోయాయి. సోషల్ మీడియాలో ఏవరో ఒక తార.. ఏదో ఒక ఛాలెంజ్ విసరడం పరిపాటిగా మారింది. ఇక రీసెంట్ గా మరో ఛాలెంజ్ తో ముందుక వచ్చింది మంచు లక్ష్మీ. 

ఈ మధ్య స్టార్స్ మధ్య ఛాలెంజ్ లు ఎక్కువై పోయాయి. సోషల్ మీడియాలో ఏవరో ఒక తార.. ఏదో ఒక ఛాలెంజ్ విసరడం పరిపాటిగా మారింది. ఇక రీసెంట్ గా మరో ఛాలెంజ్ తో ముందుక వచ్చింది మంచు లక్ష్మీ. 

ఇప్పటి వరకు మన దగ్గర గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చాలా ఫేమస్. సినిమా తారల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరు పాల్గొంటున్నారు. ఇప్పుడు అటువంటి ఛాలెంజ్ లు ఫిల్మ్ సెలబ్రెటీలలో.. ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ స్టార్స్ లో కొత్త కొత్త ఛాలెంజ్ లు మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీల్లో ఎటాక్‌ ఛాలెంజ్‌ నడుస్తుండగా.. ఇప్పుడు మంచు లక్ష్మీ మరో ఛాలెంజ్ ను స్టార్ట్ చేశారు.

View post on Instagram

కొత్త కొత్త చాలెంజ్ లు మనిషికి మంచి మజా పంచుతున్నాయి. ముఖ్యంగా సినీ తారల మధ్య ఇవి ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే..ఇప్పుడు ప్రముఖ నటి మంచు లక్ష్మి విసిరిన ఓ చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిట్ డౌన్ పేరుతో మంచువారి ఆడపడుచు ఓ కొత్త చాలెంజ్ విసిరారు.దీనికి సంబంధించిన ఓ వీడియోను రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది మంచు లక్ష్మీ. 

వివిధ సందర్భాలు, వివిధ రకాల డ్రెస్సులో మంచు లక్ష్మీ చేసిన వీడియోలకు మంచి స్పందన వస్తోంది. సిట్ డౌన్ ఛాలెంజ్ లో భాగంగా రకరకాల వీడియోలను పేర్చి ఓ స్పెషల్ వీడియోగా రూపొందించింది లక్ష్మీ. ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది. ఇలాంటి ట్రెండ్స్ ను ఫాలో అయ్యేందుకు అస్సలు ఆలస్యం చేయకూడదంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.