`నాయకత్వం అంటే దారి పొడవునా నడవటం కాదు, బాట వేయడం మరియు త్రోవ చూపడం` ఇలాంటి నాయకత్వ లక్షణాలని పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్న వ్యక్తి డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్. మన భారత రాజ్యాంగ రూపశిల్పి, కోట్లాది భారతీయుల మనసు గెలుచుకొని ఎంతో మందికి ప్రేరణగా నిలిచిపోయిన మహానుభావుడు.

ఇలాంటి ఒక మహనీయుడి చరిత్రని మన ముందుకు తీసుకువస్తుంది జీ తెలుగు. ఇది వరకు ఎప్పుడూ తెలుగు టెలివిజన్ రంగంలో చూపించని విధంగా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మనముందుకు రాబోతుంది. ఆయన బాల్యం నుంచి, మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అయ్యే వరకు, అలాగే ఏ విధంగా బడుగు బలహీన వర్గాల వారికి బాట వేసి చరిత్ర పుటలో తనకంటూ కొన్ని పేజీలు ఎలా సంపాదించారు అనేది జీ తెలుగు ప్రసారం చేసే 'మన అంబేద్కర్' అనే సీరియల్ లో చూపించబోతున్నారు.

అంబేడ్కర్ పాత్రలో సాగర్ దేశ్ముఖ్ నటించారు. 'మన అంబేద్కర్' సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 5 : 30 గంటలకు సెప్టెంబర్  21 నుండి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ప్రసారం కానుంది. అంతటి మహనీయుడి జీవితంలో ఎన్ని మలుపు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ సీరియల్‌ తప్పక చూడాలంటున్నారు మేకర్స్.