విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్‌ సేతుపతి. ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం 800. దిగ్గజ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రాజకీయంగా వివాదంలో చిక్కుకుంది.   మురళీధరన్‌ పాత్రను ఆయన పోషించబోతుండటంతో తమిళనాడుకు చెందిన అనేక రాజకీయ పార్టీల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘విజయ్‌ సేతుపతి.. నీ పట్ల సిగ్గుపడుతున్నాం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది.

అంతేకాదు..ఆ విమర్శలు హద్దుదాటి ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసే స్దాయికి వెళ్లాయి. రితిక్ అనే  ఓ ట్విట్టర్ యూజర్  .. విజయ్ సేతుపతి ఆ సినిమా చేయటం మానకపోతే..ఆయన మైనర్ కుమార్తెను రేప్ చేస్తానంటూ బెదిరించారు. ఈ నేపధ్యంలో అతనిపై నెట్ జనలు మండిపడుతున్నారు. జైల్లో పెట్టాలంటున్నారు. డీఎంకే ఎమ్ పి సెంధిల్ కుమార్ ..అసలు వాడు మనిషేనా..అలాంటివాడిని పట్టుకుని జైల్లో పెట్టండి అన్నారు. ఆ కామెంట్‌ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ సామాన్యులు మొదలు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా డిమాండ్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అడ్రస్‌ని ట్రేస్‌ చేశారు. ప్రస్తుతం అతడు శ్రీలంకలో ఉండగా.. అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్‌ సహకారాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో రిత్విక్ ఓ వీడియోను విడుదల చేశాడు. అలాంటి కామెంట్లు చేయడం తన తప్పేనని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో తన ఉద్యోగం పోయిందని, ఆ ఫ్రస్టేషన్‌లో తాను ఉన్నానని.. ఇక శ్రీలంకలో తమిళుల ద్రోహీగా భావించే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలియడంతో ఆ కోపాన్ని భరించలేకనే ఆ ట్వీట్ చేశానని అన్నాడు. ఇక ఈ వీడియోలో అతడి తల్లి కూడా మాట్లాడింది. తన కుమారుడు చేసిన చర్య తప్పేనని.. తమిళులు తమను క్షమించాలని కోరారు.

  శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ 800లో నటించేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకోగా.. అందులో నుంచి సేతుపతి తప్పుకోవాలంటూ కొంతమంది నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సేతుపతిని ఇబ్బంది పెట్టకూడదని భావించిన మురళీధరన్‌, తన బయోపిక్‌ నుంచి తప్పుకోవాలంటూ కోరారు. దీంతో 800 నుంచి విజయ్ తప్పుకున్నారు. అయినప్పటికీ కొంతమంది నిరసనలను ఆపలేదు. ఈ క్రమంలోనే అతడి కుమార్తెను అత్యాచారం చేస్తే గానీ విజయ్‌కి ఆ బాధ తెలీదంటూ రిత్విక్‌ సోషల్ మీడియాలో కామెంట్‌ పెట్టాడు.


దీనిపై మురళీధరన్‌ ఇటీవల స్పందిస్తూ.. ‘నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. క్రికెట్‌లో నిలదొక్కుకొని ఏవిధంగా విజయం సాధించాననే విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తారు. శ్రీలంకలో తమిళుడిగా జన్మించటం నా తప్పా? నేను శ్రీలంక క్రికెట్ జట్టులో సభ్యుణ్ని. అందువల్ల నేను కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అనేక కారణాల వల్ల రాజకీయం చేస్తున్నారు. నేను మారణ హోమానికి మద్దతు ఇచ్చానని ఆరోపణలు చేస్తున్నారు. నేను 2009లో తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను..’ అని వివరణ ఇచ్చారు.

అయినా సరే విమర్శలు ఆగకపోవడంతో.. సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోన్న విజయ్‌ కెరీర్‌ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో తన సినిమా నుంచి తప్పుకోమని ముత్తయ్య మురళీధరన్‌ తాజాగా కోరారు. ‘నా బయోపిక్‌ వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో నేను ఈ ప్రకటన చేస్తున్నా. విజయ్‌ సేతుపతికి వ్యతిరేకంగా అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘800’ సినిమా నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ నటుడి కెరీర్‌ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఇందులో నటిస్తే ఆయనకు భవిష్యత్తులోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని విజయ్‌ సేతుపతిని కోరుతున్నా’.