Asianet News TeluguAsianet News Telugu

అబ్బాయిలతో కంటే అమ్మాయిలతోనే రొమాన్స్ ఈజీ.. శృంగార తార కామెంట్స్

తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో మల్లికా శరావత్ శృంగార తారగా ముద్ర వేయించుకుంది. బాలీవుడ్ చిత్రాల్లో ముద్దు సన్నివేశాల్లో మల్లికా శరావత్ ఎంత బోల్డ్ గా నటించిందో వర్ణించనవసరం లేదు.

Mallika Sherawat sensational comments on romance with female
Author
Hyderabad, First Published Sep 23, 2021, 3:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో మల్లికా శరావత్ శృంగార తారగా ముద్ర వేయించుకుంది. బాలీవుడ్ చిత్రాల్లో ముద్దు సన్నివేశాల్లో మల్లికా శరావత్ ఎంత బోల్డ్ గా నటించిందో వర్ణించనవసరం లేదు. మర్డర్ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మితో మతిపోగోట్టే రొమాన్స్ తో రెచ్చిపోయింది. 

కొన్ని చిత్రాల్లో మల్లికా హాఫ్ న్యూడ్ గా కూడా నటించింది. ఈ బోల్డ్ బ్యూటీ ఆఫ్ స్క్రీన్ లోచేసే కామెంట్స్ కూడా బోల్డ్ గానే ఉంటాయి. తాజాగా మల్లికా శరావత్ రొమాన్స్ గురించి చేసిన కామెంట్స్ కు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మల్లికా శరావత్ రొమాన్స్ గురించి మాట్లాడుతూ.. అబ్బాయిలతో రొమాన్స్ చేయడం కంటే అమ్మాయిలతో రొమాన్స్ చేయడమే చాలా ఈజీ అని హాట్ కామెంట్స్ చేసింది. 

ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో మల్లికా శరావత్ యూ తిరుగులేదు. అయినప్పటికీ మరీ ఒక అమ్మాయి మరో అమ్మాయితో రొమాన్స్ ఏంటి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మల్లికా శరావత్ ఈ కామెంట్స్ చేయడానికి కారణం ఉంది. ప్రస్తుతం మల్లికా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'నకాబ్' ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతోంది. 

నకాబ్ లో మల్లికా శరావత్, బోల్డ్ హీరోయిన్ ఇషా గుప్త ప్రధాన పాత్రల్లో నటించారు. మల్లికా, ఇషా మధ్య రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయట. బహుశా ఆ సన్నివేశాలను ఉద్దేశించే మల్లికా అమ్మాయిలతో రొమాన్స్ ఈజీ అనే కామెంట్స్ చేసి ఉంటుంది. నకాబ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్. 

ఇదిలా ఉండగా మల్లికా శరావత్ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తాను చాలా మంది హీరోలతో పడుకోలేదని అవకాశాలు కోల్పోయినట్లు ఆ మధ్యన సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios