శృంగార తారగా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది మల్లికా శరావత్. మల్లికా శరావత్ నటించిన మర్డర్ చిత్రం అప్పట్లో బాలీవుడ్ లో ఓ సంచలనం. ఆ చిత్రంలో నగ్న సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ తో మల్లిక రెచ్చిపోయింది. ప్రస్తుతం మల్లికా శరావత్ ప్రస్తుతం బాలీవుడ్ కు కాస్త దూరంగా ఉంటోంది. 

మునుపటిలా వరుసగా సినిమాలు చేయడం లేదు. తాజాగా మల్లికా శరావత్ ఓ ఇంటర్వ్యూలో ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్లపై హాట్ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు న్యూడ్ సీన్స్ లో , ముద్దు సన్నివేశాల్లో నటించడం సంచలనం. నేను కొన్ని చిత్రాల్లో అలా నటించా. ఆ సమయంలో నాపై అనేక విమర్శలు ఎదురయ్యాయి. 

కానీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ఎలాంటి బెదురులేకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ముద్దు సన్నివేశాలు, న్యూడ్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. నటించేవాళ్లకు.. చూసేవాళ్లకు ఇబ్బంది లేనప్పుడు ఇక వివాదం ఏముంది అని మల్లిక తెలిపింది.