గతేడాది టాలీవుడ్ లో డ్రగ్స్ స్కాండల్ డొంక కదిలిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు గుట్టు లీకైంది. కానీ ప్రస్తుతం ఈ డ్రగ్స్ వ్యవహారం సద్దుమణిగింది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ హీరోయిన్ డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కింది. అసలు విషయంలోకి వస్తే.. మలయాళ టీవీ-సినీ నటి అశ్వతి బాబు
తన కారు డ్రైవర్ తో కలిసి ప్రమాదకర ఎండిఎంఏ డ్రగ్ ని కస్టమర్ కి అందించడానికి ఎదురు చూస్తోందట.

అశ్వతి తన ఇంటి పరిసరాల్లోనే తచ్చాడుతూ కనిపించింది. అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు తెలివిగా ఆమెను పట్టుకున్నారు. ఆదివారం నాడు ఆమెని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విషయంపై ఆమెను విచారిస్తున్నారు.

ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎంతమంది పేర్లు బయటపడతాయో అని ఆసక్తికర చర్చ సాగుతోంది. అశ్వతి తిరువంతపురం నుండి వచ్చి మాలీవుడ్ లో నటిగా స్థిరపడింది.  నటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూనే మరోపక్క ఇలా డ్రగ్స్ సప్లయ్ చేస్తుందని తెలుసుకున్న ఆమె సన్నిహితులు, స్నేహితులు షాక్ అవుతున్నారు.