లాక్‌ డౌన్‌, కరోనా చాలా మందిని రొమాంటిక్‌ మూడ్‌లో ఉంచుతోంది. సెలబ్రిటీలు మాత్రం ఫుల్‌గా ఫ్యామిలీతో గడుపుతున్నారు. సైఫ్‌ అలీఖాన్‌- కరీనా కపూర్‌, విరాట్‌ కోహ్లీ- అనుష్క శర్మ లాక్‌ డౌన్‌ టైమ్‌లో పిల్లలను కనే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారు. 

ఇక టాలీవుడ్‌ కపుల్స్ సైతం ఫ్యామిలీతోనే టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా మహేష్‌ బాబు మొత్తం తన భార్య, నటి నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతో సరదాగా గడుపుతున్నాడు. అయితే తాజాగా నమ్రత.. మహేష్‌బాబుతో ఉన్న ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మహేష్‌ కౌగిలిలో నమ్రత ఉంది. వీరిద్దరు మంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నారు. 

ఈ ఫోటోని షేర్‌ చేస్తూ నమ్రత ప్రేమకి సంబంధించి పెద్ద కొటేషన్‌ పంచుకుంది. ప్రేమకు సంబంధించిన తన భావనని షేర్‌ చేసుకుంది. ఆమె చెబుతూ, `ప్రేమనే మన మూలానికి కారణమని, అదే మనల్ని పరిపాలిస్తుందని నేను బాగా నమ్ముతాను. ప్రేమ మాత్రమే మనల్ని సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు వీలు కల్పిస్తుంది. దయ, కరుణ అన్నీ ప్రేమ అనే భావోద్వేగం నుంచి పుట్టినవే. ప్రేమ నిజమైనది. అది మనల్ని చాలా ఎత్తులో ఉంచుతుంది. ఇది నాకున్న అవగాహన. కాబట్టి ప్రేమగా ఉండండి..ప్రేమతో ఉండండి. మనం జీవించడానికి ఒక జీవితమే కలిగి ఉన్నాం. దానికోసం సంతోషంగా, సురక్షితంగా ఉండండి. నా సంతోషానికి, నాప్రేమకి ఇదే కారణం` అని మహేష్‌తో దిగిన ఫోటోని పంచుకుంది నమ్రత. 

చాలా క్యూట్‌గా, రొమాంటిక్‌గా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మహేష్‌ అభిమానులు దీన్ని తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇక నెటిజన్లు కామెంట్లకి పనిచెప్పారు. భిన్నమైన కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట`చిత్రంలో నటిస్తున్నారు. ఇది షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ ఎంపికైందని టాక్‌.