Asianet News TeluguAsianet News Telugu

మహేష్‌ ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌.. `సూపర్‌స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌`.. పర్‌ఫెక్ట్ బర్త్ డే ట్రీట్‌

మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన `బర్త్ డే బ్లాస్టర్‌`(టీజర్‌)ని విడుదల చేశారు. నిజానికి తొమ్మిది గంటలకు ఈ టీజర్‌ విడుదల చేస్తామన్నారు. 

maheshbabu birthday treat super star birthday blaster out now
Author
Hyderabad, First Published Aug 9, 2021, 8:52 AM IST

వెయిటింగ్‌ ఓవర్‌. మహేష్‌ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. `సూపర్‌స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌` పేరుతో విడుదల చేయబోతున్న స్పెషల్‌ టీజర్‌ వచ్చేసింది. నేడు సోమవారం(ఆగస్ట్ 9) మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన `బర్త్ డే బ్లాస్టర్‌`(టీజర్‌)ని విడుదల చేశారు. నిజానికి తొమ్మిది గంటలకు ఈ టీజర్‌ విడుదల చేస్తామన్నారు. కానీ ఓ గంట ముందే రిలీజ్‌ చేసి మహేష్‌ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేశారు యూనిట్‌. 

ఇక తాజాగా విడుదలైన `సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌` కేక పెట్టిస్తుంది. బర్త్ డేకి పర్‌ఫెక్ట్ ట్రీట్‌ అనేలా ఉంది. మహేష్‌ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మాస్‌, క్లాస్‌ మేళవింపుగా ఉందీ బ్లాస్టర్. ఇందులో `ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా..` అంటూ మహేష్ బాబు ఎంట్రీని అదిరిపోయేలా చూపించారు. `ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్` అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ కేక పుట్టించేలా ఉంది. మొదట యాక్షన్ సీన్స్‌తోనే ఈ బ్లాస్టర్‌ను పేల్చేశారు మూవీ యూనిట్‌. `ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌` అంటూ విలన్స్ ని ఉద్దేశించి మహేష్‌ చెప్పిన డైలాగ్‌ గూస్‌బమ్స్ వచ్చేలా ఉంది.

క్లాస్‌ విషయానికి వస్తే.. హీరోయిన్‌ కీర్తి సురేష్‌, మహేష్‌కి హారతి ఇస్తూ, `సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్ఠి తీయడం మాత్రం మర్చిపోకండి` అని చెప్పగానే, మహేష్‌ ఇచ్చే ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. చీరకట్టులో కీర్తిసురేష్‌ మరింత అందంగా ఉంది. అదే సమయంలో మహేష్‌, కీర్తి మధ్య లవ్‌, రొమాంటిక్‌, కామెడీ సన్నివేశాలు రక్తికట్టేలా ఉన్నాయి. మొత్తంగా `సర్కారు వారి పాట బ్లాస్టర్‌`తో మరో హిట్ మహేష్‌ పక్కా అనే సిగ్నల్స్ ఇచ్చేశాడు మహేష్‌. 

ఇక ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. `గీతగోవిందం` తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మహేష్‌ నటిస్తున్న 27వ సినిమా కావడం విశేషం. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి సందర్బంగా జనవరి 13, 2022న సినిమాని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం మరోసారి కన్ఫమ్‌ చేశారు. ఇక ప్రస్తుతం విడుదలైన `సూపర్‌స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌` సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios