ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన పలు ప్రపంచ దేశాలు క్రమంగా సడలింపులు ఇస్తున్నాయి. అయితే కరోనా ముప్పు పూర్తిగా పోనంతకాలం లేదా కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేంతవరకు ముఖానికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని అన్ని దేశాలు చెబుతున్నాయి. అదే విధంగా మనదేశంలోనూ మెల్లిగా సడలింపులతో ప్రజా జీవితం తిరిగి గాడిలో పడుతోంది. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన భాధ్యత జనాలపైనా ఉంది. ఈ విషయంలో మాస్క్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే మహేష్ బాబు ఈ విషయమై కాస్తంత ఎవేర్నెస్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నారు. తాను మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ, అందరూ మాస్కులు ధరించాలని హీరో మహేశ్ బాబు సూచన చేశాడు. 

కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపులతో క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయని ఆయన గుర్తు చేశాడు.ఇటువంటి సమయంలో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కులు ధరించాలని ఆయన సూచించాడు. దీనివల్ల మనతో పాటు ఇతరులను రక్షిస్తున్న వారమవుతామని చెప్పాడు. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోందని ఆయన అన్నాడు. ఇటువంటి సమయంలో మాస్కులు ధరించడం చాలా మంచిదని చెప్పాడు. 'నేను మాస్కు ధరించాను.. మరి మీరు?' అంటూ మహేశ్ బాబు ప్రశ్నించాడు. 

ఇక కెరీర్ విషయానికి వస్తే ...ప్రస్తుతం  దర్శకుడు పరశురామ్ తో కలిసి సెట్స్  పైకి వెళ్లడానికి మహేష్  సిద్ధమవుతున్నాడు.  మహేశ్ బాబు వరుసగా సామాజిక సమస్యలతో ముడిపడిన కథలను చేస్తూ వస్తున్నాడు. దాంతో వాటిల్లో హీరోయిన్ పాత్రలకి .. ఆమెతో ప్రేమ ప్రయాణానికి సంబంధించిన నిడివి చాలా తక్కువగా ఉంటూ వస్తోంది. అందువలన ఈ సారి ప్రేమపాళ్లు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేశ్ బాబును కొంతసేపు కాలేజ్ స్టూడెంట్ గా పరశురామ్ చూపించనున్నాడని అంటున్నారు. 

ఇంతకుముందు 'శ్రీమంతుడు' .. 'భరత్ అనే నేను' .. 'మహర్షి'  సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ గా మహేశ్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే పరశురామ్ కూడా స్టూడెంట్ గా మరింత యంగ్ లుక్ తో మహేశ్ బాబును చూపించనున్నాడని చెబుతున్నారు.  ఇందుకోసం  మహేశ్ బాబు కొంత బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దింపే ఆలోచనలో వున్నారు.