Asianet News TeluguAsianet News Telugu

సూపర్‌స్టార్‌ అయ్యేందుకు రాకుమారుడు పుట్టాడుః మహేష్‌ నుంచి మరో అప్‌డేట్‌

మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. సాయంత్రం 4.05గంటలకు ఈ అప్‌డేట్‌ వస్తుందని వెల్లడించారు.

mahesh trivikram movie ssmb28 update will come today on his birthday occasion
Author
Hyderabad, First Published Aug 9, 2021, 9:21 AM IST

మహేష్‌బాబు బర్త్ డే(ఆగస్ట్ 9) సందర్భంగా ఇప్పటికే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు `సర్కారు వారి పాట` టీమ్‌. ఇప్పుడు మరో అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు `ssmb28` టీమ్‌. నెక్ట్స్ తన 28వ చిత్రంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మహేష్‌. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `అతడు`, `ఖలేజా` తర్వాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. 

బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. సాయంత్రం 4.05గంటలకు ఈ అప్‌డేట్‌ వస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోని పంచుకుంది యూనిట్‌. `ఆగస్ట్ 9, 1975లో `సూపర్‌స్టార్ అయ్యేందుకు ఓ రాకుమారుడు` పుట్టాడనే లైన్‌తో ఇది ప్రారంభమైంది. ఇందులో `అతడు` సినిమాలోని సీన్లతో వీడియోని చూపించారు. ఆయన సినిమాల్లోని హైలైట్‌ సీన్లు, ఫైట్‌ సీన్లతో సాగింది. 

మరోవైపు ఆయన రియల్‌లైఫ్‌లోనూ సూపర్‌స్టార్‌ అనిపించుకున్న సేవా కార్యక్రమాలు, చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ ని చూపిస్తూ సాగిన వీడియో ఆకట్టుకుంటుంది`. `పిల్లలకు సర్జరీ చేసే ముందు మహేష్‌బాబు పేరు చెబితే నవ్వుతార`ని ఓ అమ్మ చెప్పింది. దీని కన్నా గొప్ప కాంప్లిమెంట్‌ని నా జీవితంలో వినలేదు సర్‌` అని మహేష్‌ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. అయితే త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios