కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం మాస్క్ తో కాపాడుకోవాలని సూపర్ స్టార్ మహేష్ బాబు  అవగాహన కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలోనూ తను మాస్క్ పెట్టుకున్న ఫొటో ట్వీట్ చేసారు. ఇప్పుడు మహేశ్ బాబు మరోసారి ఇదే విషయంపై ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి, నోటికి చేయి అడ్డుపెట్టుకుని ఉన్న సినీ ప్రముఖుల పాత ఫొటోలను సేకరించి ఒక్కచోట చేర్చాడు. ఆ ఫొటోని మహేష్ షేర్ చేసారు. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

 
ఈ ఫొటోలో మహేశ్ బాబుతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ధోనీ, హృతిక్ రోషన్, ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, టైగర్ ష్రాఫ్ ఉన్నారు. క్రికెట్ ధోనీ కూడా గ్లోవ్స్‌ వెనుక తన ముఖం పెట్టుకుని ఉన్నారు. మాస్క్‌ ఇండియా ట్యాగ్‌తో దీన్ని మహేశ్ తన ట్విట్టర్ ఖాతా‌లోనూ షేర్ చేశారు. అందరూ మాస్కు ధరించాలని ఆయన కోరారు. 

ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన పలు ప్రపంచ దేశాలు క్రమంగా సడలింపులు ఇస్తున్నాయి. అయితే కరోనా ముప్పు పూర్తిగా పోనంతకాలం లేదా కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేంతవరకు ముఖానికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని అన్ని దేశాలు చెబుతున్నాయి. అదే విధంగా మనదేశంలోనూ మెల్లిగా సడలింపులతో ప్రజా జీవితం తిరిగి గాడిలో పడుతోంది. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన భాధ్యత జనాలపైనా ఉంది. ఈ విషయంలో మాస్క్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే మహేష్ బాబు ఈ విషయమై కాస్తంత ఎవేర్నెస్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నారు.  
 
ఇక మహేష్ కెరీర్ విషయానికి వస్తే ...ప్రస్తుతం  దర్శకుడు పరశురామ్ తో కలిసి సెట్స్  పైకి వెళ్లడానికి మహేష్  సిద్ధమవుతున్నాడు.  మహేశ్ బాబు వరుసగా సామాజిక సమస్యలతో ముడిపడిన కథలను చేస్తూ వస్తున్నాడు. దాంతో వాటిల్లో హీరోయిన్ పాత్రలకి .. ఆమెతో ప్రేమ ప్రయాణానికి సంబంధించిన నిడివి చాలా తక్కువగా ఉంటూ వస్తోంది. అందువలన ఈ సారి ప్రేమపాళ్లు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేశ్ బాబును కొంతసేపు కాలేజ్ స్టూడెంట్ గా పరశురామ్ చూపించనున్నాడని అంటున్నారు. 

ఇంతకుముందు 'శ్రీమంతుడు' .. 'భరత్ అనే నేను' .. 'మహర్షి'  సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ గా మహేశ్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే పరశురామ్ కూడా స్టూడెంట్ గా మరింత యంగ్ లుక్ తో మహేశ్ బాబును చూపించనున్నాడని చెబుతున్నారు.  ఇందుకోసం  మహేశ్ బాబు కొంత బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దింపే ఆలోచనలో వున్నారు.