ఆ ముద్దు వెనుక సీక్రెట్ బయటపెట్టిన మహేష్

Mahesh Reveals secret behind kissing Namratha
Highlights

 ఆ ముద్దు వెనుక సీక్రెట్ బయటపెట్టిన మహేష్

మహేష్ భరత్ అనే నేను రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. గత రెండు ఏళ్ల నుండి మహేష్ కి చెప్పుకో దగ్గ హిట్లు లేవు. భరత్ అనే నేను సినిమా రిలీజ్ టైం మహేష్ టాలా టెన్షన్ లో ఉన్నాడట. ఆరోజు మహేష్ భార్య నమ్రతకు ప్రేమతో ముద్దు ఇస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయింది. ముచ్చటైన జంటకు కేరాఫ్ అడ్రస్ లా ఉండే వీళ్లిద్దరి మధ్య అనురాగం చూసి అంతా హ్యాపీగా పీలయ్యారు. మహేష్ ఇలాంటి ఫొటో షేర్ చేయడ ఇదే ఫస్ట్ టైం. ఆ ముద్దు వెనుక కదిలించే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ రీసెంట్ గా బయటకొచ్చింది. 
  
‘యూఎస్ లో ప్రీమియర్లు విడుదలైన రోజున మొదటి గంట నుంచే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని నమ్రత ఆరాటపడుతూనే ఉంది. ఫస్ట్ రివ్యూ రాగానే వచ్చి నన్ను నిద్రలేపింది. ఆ క్షణం తన కంటినిండా నీళ్లే కనిపించాయి. అప్పుడు నాకనిపించింది ఈ సినిమా కూడా ఫ్లాపేనని. కానీ నమ్రత సంతోషం.. కన్నీళ్లు కలగలసిన స్వరంతో ఎంతో ఎమోషన్ గా చెప్పింది సినిమాకు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని. ఆ క్షణం మా ఇద్దరికీ ఎన్నటికీ మరువలేనిది’’ మహేష్ తన అనుభవనాన్ని పంచుకున్నాడు.

loader