హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి సమరానికి సినీ క్రిటిక్ మహేష్ కత్తి సిద్ధపడ్డారు. ఇక మీదట నేరుగా తాను పవన్ కల్యాణ్ ని తిడుతానని చెప్పారు. పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ ఆయన అభిమానులు దాన్ని పాటించడం లేదని, తనను దూషించడం మానడం లేదని మహేష్ కత్తి అన్నారు. 

తనను దూషిస్తే ఇక సహించబోనని ఆయన ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. "నిన్ననే పవన్ కల్యాణ్... ఫ్యాన్స్ కి అనవసరంగా కెలుక్కోకండి అని సలహా యిచ్చాడు. అయినా ఫ్యాన్స్ ఫాలో అవ్వడం లేదు. కాబట్టి, ఈ రోజు నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టే ప్రతి బూతూ నేను పవన్ కల్యాణ్ ను తిడతాను. ఓకేనా! మారండి. లేకపోతే, మీ అశుద్ధం రుచి మీ పవన్ కల్యామ్ చూస్తాడు" అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు. 
అంతకు ముందు ఆయన నేను వస్తున్నాను పవన్ కల్యాణ్ అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత మరో ట్వీట్ కూడా పెట్టారు. 

"నేను పవన్ కళ్యాణ్ తో మాట్లాడదాం అని వెళ్లాను. సంఘీభావం వ్యక్తపరచడానికి వెళ్ళాను. తల్లి ఎవరికైనా తల్లే అనే నినాదంతో ముందుకెళ్లండి. పరిశ్రమ కోసం పాటుపడండి. అనవసరపు రాజకీయం చెయ్యకండి. అని చెప్పడానికి వెళ్లాను. ఫ్యాన్స్ నాపై దాడికి ప్రయత్నం చేశారు" అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.