బాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ పేరు ప్రస్తావించారని జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ గా పని చేసిన జయ సాహా విచారణలో నమ్రత పేరును కూడా బయటపెట్టారని వార్తలు వచ్చాయి. దీనితో సోషల్ మీడియా వేదికగా నమ్రత మరియు మహేష్ దంపతులపై ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు నెటిజెన్స్ సూటిగా అనేక ప్రశ్నలు వీరికి సంధిస్తున్నారు. నమ్రతను డిఫేమ్ చేసే విధంగా నెగెటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

గత రెండు రోజులుగా డ్రగ్ అడిక్ట్ నమ్రత, అరెస్ట్ నమ్రత అనే ట్యాగ్స్ ని సోషల్ మీడియాలో ట్రెండు చేయడం జరుగుతుంది. ఈ పరిణామం మహేష్ ఫ్యాన్స్ ని తీవ్రంగా కలచి వేస్తుంది. కేవలం ఉహాగానాలను ప్రచారం చేయవద్దని వారు కోరుకుంటున్నారు. ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా నమ్రతపై ఆరోపణలు చేయడం సరికాదని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇక డై హార్డ్ మహేష్ ఫ్యాన్స్ తల్లిలాంటి వదినమ్మపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. 

 టాలీవుడ్ కి చెందిన రకుల్ ప్రీత్ పై కూడా డ్రగ్ ఆరోపణలు రావడం జరిగింది. రకుల్ తనపై వస్తున్న నిరాధారమైన మీడియా రాతలకు అడ్డుకట్ట వేయాలని కోర్ట్ ని కోరడం జరిగింది. టాలీవుడ్ నుండి నమ్రత, రకుల్ పేర్లు వినిపిస్తుండగా, డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ పాత్ర ఏమిటనే సందేహం మొదలవుతుంది. రెండేళ్ల క్రితం టాలీవుడ్ కి చెందిన 15మంది డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్,  హీరో రవితేజ, ఛార్మి, తరుణ్, సుబ్బ రాజ్, మొమైత్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ డ్రగ్స్ విచారణ ఎదుర్కొనడం జరిగింది.