డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నేడు తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.  సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా పూరికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. మహేష్ ట్వీట్ లో పూరి తన ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరని చెప్పడం విశేషం. '' నా ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాద్ కి జన్మదిన శుభాకాంక్షలు, మీ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను'', అని ట్వీట్ చేశారు. 

మహేష్, పూరి మధ్య మనస్పర్థలు వున్నాయన్న పుకార్లకు మహేష్ ట్వీట్ చెక్ పెట్టింది. గతంలో దర్శకుడు పూరి జగన్నాధ్ ని మహేష్ తో మూవీ గురించి అడుగగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను సక్సెస్ లో లేకపోతే మహేష్ పట్టించుకోరు అన్నారు. ఈ కామెంట్స్ మహేష్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఫార్మ్ లో లేని పూరి ఎన్నిసార్లు ప్రయత్నించినా మహేష్ అవకాశం ఇవ్వలేదని పూరి కామెంట్ పరోక్షంగా తెలియజేసింది. 

కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం పూరితో మరో మూవీ చేయాలని కోరుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. పోకిరి ఇండస్ట్రీ హిట్ అందుకోగా, బిజినెస్ మెన్ సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు చిత్రాలలో మహేష్ మేనరిజాన్ని పూరి కొత్తగా ఆవిష్కరించారు. ప్రస్తుతం పూరి హీరో విజయ్ దేవరకొండతో ఫైటింగ్ నేపథ్యంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు.