సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఆమె అప్పట్లో తన చెల్లి శిల్పా శిరోద్కర్ తో దిగిన ఓ ఫోటో పంచుకున్నారు. నమ్రత, శిల్పా పింక్ డ్రెస్ ధరించి మెస్మరైజింగ్ కళ్ళతో ఆకర్షించేలా ఉన్నారు. ఇక ఆ ఫొటోకు ఫైర్ అండ్ ఐస్, భిన్న ధృవాలు... అంటూ క్యాప్షన్ పెట్టారు. నమ్రత పంచుకున్న ఆ ఫొటోకు శిల్పా శిరోద్కర్ స్పందించారు. మనది లైఫ్ టైం బంధం అంటూ ఆమె నమ్రతకు ఐ లవ్ యూ చెప్పారు. 

ఈ లవ్లీ సిస్టర్స్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శిల్పా శిరోద్కర్ తెలుగు ప్రేక్షకులు తెలిసింది తక్కువే అని చెప్పాలి. మోహన్ బాబు హీరోగా 1992లో విడుదలైన బ్రహ్మ మూవీ తరువాత తెలుగులో చేయలేదు. 90లలో బాలీవుడ్ లో శిల్పా హీరోయిన్ గా అనేక చిత్రాలు చేశారు. ఐతే అక్క నమ్రత రేంజ్ లో పాపులర్ కాలేదు. 2000లో వివాహం చేసుకున్న శిల్పా ప్రస్తుతం తక్కువగా చిత్రాలు చేస్తున్నారు. 
ఇక ముంబై వెళ్లిన ప్రతిసారి మహేష్ కుటుంబంతో శిల్పా ఫ్యామిలీ కలుస్తారు. 

మరో వైపు అక్క నమ్రత మహేష్ సలహాదారుగా మారిపోయారు. ఆయన సినిమాలతో పాటు, వ్యాపార ప్రకటనల ఒప్పందాలు ఆమెనే చూస్తారు. అలాగే మహేష్ సొంత నిర్మాణ సంస్థలో చిత్రాల నిర్మాణ బాధ్యత కూడా నమ్రతదే అని సమాచారం. కంప్లీట్ వైఫ్ గా మారిపోయిన నమ్రత, పిల్లలు మరియు మహేష్ వ్యవహారాలు చూసుకుంటారు.