సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాను స్టార్ట్ చేశాడు అంటే వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటాడు. సరిలేరు నికెవ్వరు సినిమాతో బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న మహేష్ వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. గీతా గోవిందం దర్శకుడు పరశు రామ్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా ఈ ఎడాది వచ్చేలా కనిపించడం లేదు.

ఎందుకంటే కరోనా కారణంగా మహేష్ రెండు నెలల పాటు ఏ పని పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యాడట. ఇక విదేశీ టూర్లను దాదాపు 5 నెలల పాటు టచ్ చేయడట. ఇక స్క్రిప్ట్స్ వినడానికి కూడా మహేష్ ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. అసలైతే మొదట మహేష్ మే నెలలో వంశీ పైడిపల్లితో ఒక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక మళ్ళీ ఇప్పుడు పరశురామ్ తో చేద్దాం అనుకుంటే పరిస్థితులు అనుకూలిచడం లేదు.

దీంతో ఈ ఏడాది మహేష్ రావడం అనుమనంగానే ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. మహేష్ రాజమౌళితో కూడా ఒక సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ కథను కూడా రెడీ చేశారు. RRR తరువాత ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. తప్పకుండా వచ్చే ఏడాది రాజమౌళి తో మహేష్ సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. మరీ ఈ లోపు మహేష్ రెండు సినిమలైనా చేస్తాడో లేదో చూడాలి.