వరుసగా మూడు హిట్లు కొట్టి సూపర్బ్ ఫాం లో దూసుకు పోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు . ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో అల వైకుంఠ పురం లో నుండి తీవ్ర పోటి ని ఎదురు కుని కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి మహేష్ కెరీర్ లో సరికొత్త రికార్డులు నమోదు చేసాడు. అయితే ఈ సినిమా సక్సెస్  తర్వాత కొంత గ్యాప్ తీసుకుని  రెస్ట్ తీసుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన అప్ కమింగ్ మూవీ ని కన్ఫాం చేశాడు.  గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురాం కి తన కెరీర్ లో 27 వ సినిమా డైరెక్షన్ అప్పగించాడు. దాదాపు రెండేళ్ళు కథ సిద్ధం చేసిన పరశురామ్ చెప్పిన కథ ని ఫైనల్ చేసిన మహేష్ బాబు ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా ఫార్మల్ గా ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

 ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఏం టైటిల్ పెట్టబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ చిత్రం టైటిల్ అంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆ టైటిల్ ఏమిటంటే...'సర్కారు వారి పాట'. “14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్” కలిసి ఈ సినిమా ని నిర్మించనున్నారు.సంగీతం  తమన్ అందించబోతున్నాడట. హీరోయిన్స్ ఇంకా కన్ఫాం కాలేదు కానీ పూజా హెడ్గే మరియు కియరా అద్వాని లలో ఒకరు కన్ఫాం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా ఒక ఇంట్రస్టింగ్ లవ్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఉపేంద్ర విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది. ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ పుట్టిన రోజైన మే 31న ప్రారంభిద్దాం అని టీమ్ భావించింది. అయితే మే 29 వరకూ తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది కాబట్టి మే 31కి లాంచ్ ఉండకపోవచ్చని అంటున్నారు.