Asianet News TeluguAsianet News Telugu

వెళ్లి ప్రపంచాన్ని పాలించు మై సన్... గౌతమ్ కి మహేష్ బర్త్ డే విషెస్!

ప్రియమైన కొడుకు గౌతమ్ కి మహేష్ తనదైన శైలిలో బర్త్ డే విషెష్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కి మహేష్ ఈ విధంగా బర్త్ డే విషెష్ చెప్పారు. 

mahesh babu son gautam celebrates his 15th birthday this is how family members conveyed their wishes
Author
Hyderabad, First Published Aug 31, 2021, 11:28 AM IST

సూపర్ స్టార్ మహేష్ వారసుడు గౌతమ్ పుట్టినరోజు నేడు. ఈ యంగ్ స్టార్ బర్త్ డే వేడుకలు కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కి బర్త్ డే విషెష్ వెల్లువెత్తున్నాయి. కృష్ణ కుటుంబంలోని మూడవ తరం నటుడు గౌతమ్ 15ఏళ్ళ ప్రాయంలోకి అడుగుపెట్టారు.

 
ప్రియమైన కొడుకు గౌతమ్ కి మహేష్ తనదైన శైలిలో బర్త్ డే విషెష్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కి మహేష్ ఈ విధంగా బర్త్ డే విషెష్ చెప్పారు. ''హ్యాపీ 15 మై సన్, కళ్ళ ముందే పెద్దవాడవుతున్న నిన్ను చూస్తూ ఉండడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.  ఎప్పుడూ నీవు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను, వెళ్లి ప్రపంచాన్ని పాలించు. లవ్ యు జిజి'' అంటూ ట్వీట్ చేశారు. మహేష్ ట్వీట్ వైరల్ గా మారడంతో పాటు, ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 


కాగా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో 2014లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ వన్ మూవీలో చిన్నప్పటి మహేష్ పాత్ర చేశాడు గౌతమ్. టీనేజ్ వయసు నాటికే మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో స్టార్ అయ్యారు. మహేష్ తండ్రి కృష్ణ, అన్నయ్య రమేష్ తో కలిసి చిత్రాలు చేశారు. సోలో హీరోగా కూడా మహేష్ టీనేజ్ లో చిత్రాలు చేశారు.  మహేష్ లాగే, గౌతమ్ కూడా టీనేజ్ లోనే వండర్స్ చేయాలని కోరుకుంటున్నారు. 


మహేష్ తో పాటు గౌతమ్ తల్లి నమ్రత శిరోద్కర్, చెల్లెలు సితార కూడా గౌతమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా గౌతమ్ ఫోటోలు పంచుకోవడంతో పాటు, ప్రేమపూర్వక శుభాకాంక్షలు వ్యక్తపరిచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios