మహేష్ ప్రస్తుతం కుటుంబంతో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొద్దిరోజులలో సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనితో మహేష్ ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. గౌతమ్, సితార మరియు భార్య నమ్రతతో ఎయిర్ పోర్ట్ కి వచ్చిన మహేష్ కెమెరా కంటికి చిక్కడం జరిగింది. అలాగే పిల్లలతో సెల్ఫీ దిగిన మహేష్, అది ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి టూర్ కి వెళుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. 

ఇక టూర్ లో ఉన్న మహేష్ కొడుకు గౌతమ్ తో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ రెస్టారంట్ లో ఫుడ్ తింటున్న గౌతమ్ ని మహేష్ హగ్ చేసుకుంటున్న ఫోటో అమేజింగ్ గా ఉంది. ఆ ఫొటోకు మహేష్ 'ఇప్పుడు గౌతమ్ ని హగ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, దీనికి ఒక కారణం, సమయం అవసరం లేదు' అని కామెంట్ పెట్టారు. 

పిల్లలను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేసే మహేష్ వాళ్ళతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. పని లేదా పిల్లలు అన్నట్లు ఉంటుంది మహేష్ లైఫ్. ఏమాత్రం షూటింగ్స్ కి విరామం దొరికినా మహేష్ తన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తారు. ప్రతి సినిమా షూటింగ్ కి ముందు, విడుదల తరువాత ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లడం, మహేష్ కి ఆనవాయితీగా ఉంది. 

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్, సర్కారు వారి పాట మూవీలో నటించనున్నారు. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించనున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.