తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

First Published 27, Apr 2018, 3:20 PM IST
Mahesh Babu gives clarity on his political entry
Highlights

తాను రాజకీయాల్లో ప్రవేశించే విషయంపై ప్రిన్స్ మహేష్ బాబు స్పష్టత ఇచ్చారు.

విజయవాడ: తాను రాజకీయాల్లో ప్రవేశించే విషయంపై ప్రిన్స్ మహేష్ బాబు స్పష్టత ఇచ్చారు. విజయవాడ బెంజీ సర్కిల్ ట్రెండ్ సెట్ లో ఆయన ప్రేక్షకులతో కలిసి భరతన్ అనే నేను సినిమా చూశారు. 

ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడారు. సినిమా విజయోత్సవానికి ఇక్కడికి వచ్చానని, రాజకీయాల గురించి మాట్లాడబోనని చెప్పారు. జీవితాంతం సినిమాలు చేస్తానని, ఇతర విషయాలను పట్టించుకోనని ఆయన చెప్పారు. 

ఇంగ్లాండుకు చెందిన లిటిల్ హెవెన్స్, ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులను, వారి తల్లిదండ్రులను మహేష్ బాబు కలిశారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన సూచించారు. 

చిన్నపిల్లలు గుండె చికిత్సలకు మహేష్ బాబు రెండేళ్లుగా సాయం చేస్తున్నారని, మహేష్ బాబు స్వగ్రామం బుర్రిపాలెంలో వైద్య శిబిరాలు నిర్వహించామని వైద్యులు చెప్పారు. చిన్నపిల్ల ఆపరేషన్లపై లఘు చిత్రం తీయడానికి మహేష్ బాబు అంగీకరించారు. 

loader