Asianet News TeluguAsianet News Telugu

'6 గోల్డెన్‌ రూల్స్‌' చెప్పిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు...ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాలను ప్రస్దావిస్తూ... ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పాడు. 

Mahesh Babu asks everyone to follow 6 golden rules
Author
Hyderabad, First Published Mar 25, 2020, 5:36 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన విశ్వరూపం చూపిస్తున్న వేళ దాని నివాణకు సెలబ్రెటీలు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు...ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాలను ప్రస్దావిస్తూ... ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పాడు. 'ఈ అనుకోని పరిస్థితుల్లో ఈ ఆరు గోల్డెన్ రూల్స్ పాటించాలని నేను కోరుతున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించాలి' అని చెప్పాడు.

మహేశ్‌ బాబు చెప్పిన ఆరు గోల్డెన్ రూల్స్‌..
1. మొదటిది, చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అడుగుపెట్టాలి.
 
2. 20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు సబ్బు, నీళ్లతో మీ చేతులు కడుక్కోండి.

3. మీ ముఖాన్ని తాకకండి. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకండి.

4. దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ మోచేతులను లేక టిష్యూను అడ్డుగా పెట్టుకోండి.  

5. సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకోండి. ఇంట్లో, బయట ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరం ఉండండి.

6.  మీకు కరోనా లక్షణాలు లేక అనారోగ్యం ఉంటే మాత్రమే మాస్క్ ని వాడండి. మీకు కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని సంప్రదించండి.

మంచి సోర్సు నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. కరోనాపై అందరితో కలిసి పోరాడి జయిద్దాం

Follow Us:
Download App:
  • android
  • ios