Asianet News TeluguAsianet News Telugu

డైరక్ట్ బూతులు, టాప్ లెస్ సీన్లు.. ట్రైలర్ నిండా ఇవే!

మోడ్రన్ యువతి ''ఆడది అబల కాదు సబల'' అనే కాన్సెప్ట్ తీసుకొని 'మగువ' అనే ఓ మూవీ రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మగువ ట్రైలర్‌లో బూతు సీన్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. 

Maguva Movie trailer released
Author
Hyderabad, First Published Aug 31, 2020, 10:18 AM IST

సినిమా ఎలా ఉన్నా ట్రైలర్ తో జనాలని ఎట్రాక్ట్ చేయాలనే పాఠం ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ నేర్పారు. ముఖ్యంగా శృంగార సినిమాలకు వెబ్ లో మంచి డిమాండ్ ఉంటుందని ఆయన ప్రూవ్ చేసారు. క్లైమాక్స్, నగ్నం అంటూ రెచ్చిపోయారు. ఇప్పుడు ఆయన దారిలోనే మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రీ రిలీజ్ బజ్ కోసం మాంచి రసవత్తరమైన సీన్స్, బూతు డైలాగులతో ట్రైలర్ కట్ చేసారు. 
 
వివరాల్లోకి వెళితే.. మోడ్రన్ యువతి ''ఆడది అబల కాదు సబల'' అనే కాన్సెప్ట్ తీసుకొని 'మగువ' అనే ఓ మూవీ రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మగువ ట్రైలర్‌లో బూతు సీన్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు.

ఈ ట్రైలర్ లో ...ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని బిల్డింగ్‌కు తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేయడం, అయితే తెల్లారేసరికి ఆ అమ్మాయి ప్రాణాలతో బయట పడటాన్ని మధ్య మధ్యలో అడల్ట్ సీన్స్ పెట్టి ఆకర్షించే ప్లాన్ చేశారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? కిడ్నాపర్స్‌తో నైట్ అంతా ఆ అమ్మాయి ఏం చేసింది? అసలు కిడ్నాపర్స్ ఏం అయ్యారు? అనేది ఈ ‘మగువ’ సినిమాలో అసలు పాయింట్. 

''మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట.. నా మాట'' అనే హీరోయిన్ డైలాగ్‌తో ట్రైలర్ ముగించారు. ఈ చిత్రం శ్రేయాస్ మీడియా ద్వారా ఓ టి టి లో విడుదల అవుతుంది.

సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఇటీవల శ్రేయాస్ ఈటీలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ ప్రకటించింది. యూనివర్సల్ డ్రీమ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీరామ్ యేదోటి దర్శకుడు. సంగీతం సాబు వర్గీస్ అందించాడు. 

డైరెక్టర్ శ్రీరామ్ యేదోటి మాట్లాడుతూ.. ‘‘మగువ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశాము. విశేష స్పందన వస్తోంది. సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడదగ్గ చిత్రం. రిలీజ్ టీజర్ త్వరలో విడుదల చేయబోతున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios