నేను కూడా రేప్ భాధితురాలినే:   పాప్ క్వీన్ మడొన్నా

madonna says iam  also rape victim
Highlights

  • త‌న‌పై అత్య‌చారం జ‌రిగింద‌ని చెప్పిన  ప్రముఖ పాప్ క్వీన్ మడొన్నా
  • లుంచియాన్‌లో జ‌రిగిన బిల్‌బోర్డ్స్ విమెన్ ఇన్ మ్యూజిక్ 2016 అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌డొన్నా
  •  తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలపై ఉద్వేగపూరితంగా మాట్లాడిన పాప్ క్వీన్

 

న్యూయార్క్‌లోని లుంచియాన్‌లో నిర్వహించిన ‘బిల్‌బోర్డ్స్ విమెన్ ఇన్ మ్యూజిక్ 2016’ కార్యక్రమంలో ‘విమెన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా మడొన్నా ఈ వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలపై ఉద్వేగపూరితంగా మాట్లాడింది. ‘‘34 ఏళ్లపాటు నా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు సాయపడిన మీకు కృతజ్ఞతలు. 

ఈ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అవమానాలు, వేధింపులు, ముఖ్యంగా అత్యాచార వేధింపులు, స్త్రీలపై ద్వేషం వంటి వాటిని ఎదుర్కొన్నా’’ అని పేర్కొంది. వయసన్నది ఓ పాపమని, దానితో చాలా జాగ్రత్తగా ఉండాలని యువతులను హెచ్చరించింది. గొప్పగొప్ప సంగీత దిగ్గజాలు కన్నుమూసినా తాను ఇంకా అందరి ముందు ఉండడం తన అదృష్టమని పేర్కొంది. మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకున్నట్టు మడొన్నా పేర్కొంది.

loader