ప్ర‌పంచ‌ వ్యాప్తంగా 190కి పైగా దేశాలను మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) హ‌డ‌లెత్తిస్తోంది. శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైర‌స్‌ను నిలువ‌రించేందుకు ప్ర‌పంచ దేశాలు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. చాలా దేశాలు ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేశాయి.
అలాగే చాలా మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కొందరు మృతి చెందడటంతో మరింతగా హాలీవుడ్ హడిలిపోతోంది. ఎక్కడ చూసినా  టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖులు పలువురు కరోనాపై తమ భయంను వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు. 

ఈ సమయంలోనే హాలీవుడ్ స్టార్ సెక్సీ స్టార్ మడోనా వరుసగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ లను పెడుతోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన బాత్ టబ్ వీడియోను పోస్ట్ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది. పూర్తి నగ్నంగా బాత్ టబ్ లో కూర్చుని  ఉన్న ఈమె మాట్లాడుతూ కరోనాకు నీవు డబ్బున్న వాడివా మంచి వాడివా చెడ్డ వాడివా అనే విషయం అక్కర్లేదు. నీవు ఎలా పని చేస్తావు.. నీవు ఎంత ఫన్నీగా ఉంటావనే విషయం కూడా పట్టించుకోవడం లేదు. 

నీవు ఎక్కడ నివశిస్తున్నావు అనే విషయాలను కూడా కరోనా పట్టించుకోకుండా పట్టి పీడిస్తుంది. నీలో ఉన్న టాలెంట్ గురించి కరోనాకు అక్కర్లేదు ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూస్తున్న కరోనా ధనిక పేద సెలబ్రెటీ సామాన్యులందరిని కూడా ఒక్క తాటిపైకి తీసుకు వచ్చిందంటూ  మడోనా చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఆమె పూర్తి నగ్నంగా బాత్ టబ్ లో గులాబీ రెక్కల మద్యలో ఉండి చెప్పడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడా వీడియో ఇనిస్ట్రాలో దొరకటం లేదు. తీసేసారా లేక ఏదన్నా టెక్నికల్ ప్లాబ్లమా అనేది అర్దం కాలేదు.